పోచారం ప్రాజెక్టు నీటి విడుదల

ABN , First Publish Date - 2023-01-01T23:26:32+05:30 IST

యాసంగి పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని ప్రధాన కాల్వ ద్వారా నూతన సంవత్సరం ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విడుదల చేశారు.

పోచారం ప్రాజెక్టు నీటి విడుదల
నీటిని విడుదల చేస్తున్న ఎమ్మెల్యే జాజాల సురేందర్‌

నాగిరెడ్డిపేట, జనవరి 1: యాసంగి పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని ప్రధాన కాల్వ ద్వారా నూతన సంవత్సరం ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం (1.820 టీఎంసీ)లతో నిండి ఉంది. యాసంగిలో పంటల సాగు కోసం ప్రాజెక్టు పరిధిలో ఏ జోన్‌ ఆయకట్టుకు చెందిన 6,400 ఎకరాల సాగు కోసం 5విడతల్లో నీటిని విడుదల చేయడానికి నీటి పారుదల శాఖాధికారులు నిర్ణయించారు. 15 రోజులు నీటిని అందించి 10 రోజులు నీటిని నిలుపుదల చేస్తూ 5 విడతల్లో పంటల సాగుకు నీటిని అందించనున్నారు. ప్రధాన కాల్వ ద్వారా 150 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజ్‌దాస్‌, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, మం డల బీఆర్‌ఎస్‌ అఽధ్యక్షుడు సిద్దయ్య, ఎల్లారెడ్డి నీటి పారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ కన్నయ్య, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-01T23:26:39+05:30 IST