కేసీఆర్‌ను గద్దె దించడమే మా ఎజెండా

ABN , First Publish Date - 2023-05-31T23:21:12+05:30 IST

అన్ని వర్గాల వారు పోరాడి సాధించుకున్న తెలం గాణలో ఒకే కుటుంబం పెత్తనం చెలాయిస్తుందని కేసీఆర్‌ను గద్దె దించు డే మా ఎజెండా అని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫేసర్‌ కోదండరాం అన్నారు.

కేసీఆర్‌ను గద్దె దించడమే మా ఎజెండా

ఫ ఎల్లారెడ్డి టీజేఎస్‌ అభ్యర్థిగా నిజ్జన రమేష్‌

ఫ టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫేసర్‌ కోదండరాం

లింగంపేట, మే 31: అన్ని వర్గాల వారు పోరాడి సాధించుకున్న తెలం గాణలో ఒకే కుటుంబం పెత్తనం చెలాయిస్తుందని కేసీఆర్‌ను గద్దె దించు డే మా ఎజెండా అని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫేసర్‌ కోదండరాం అన్నారు. ఆయన బుధవారం లింగంపేట మండల కేంద్రంలో టీజేఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆయన తెలియజేశారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలపై గ్రామాల్లో నిలదీయాలని ఆయన సూచిం చారు. కేసీఆర్‌ను గద్దె దించే సమయం ఆసన్నమైందని ఆయన తెలి యజేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పి ఎంత మందికి కట్టించారని ఆయన ప్రజలను అడిగారు. ధరణి సమస్యతో రైతులు ఏళ్ల తరబడి తహసీల్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదని ఆయన విమర్శించారు. విద్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిండం వల్ల గ్రామీణ పేద విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ప్రతీ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలను స్థాపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం నాయకులు మన ఓట్లతో గెలిచి మన నెత్తిమీద చేయి పెడుతున్నారని ఓటర్లు జాగ్రత్తగా ఓటు వేయాలని ఆయన సూచించారు. మన ఓట్లకు పుట్టినోడు మన కోసం పని చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 100కు పైగా కేసు మోపి 75రోజులు జైలు జీవితం గడిపిన మన లింగంపేట మండలం కన్నాపూర్‌కు చెందిన నిజ్జన రమేష్‌ను ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీతో నైనా పొత్తులు పెట్టుకుంటారా అని విలేకర్లు ప్రశ్నించగా అవసరమైన చోట కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెంటుకుంటామని ఆయన తెలియ జేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌, జిల్లా కన్వీనర్‌ లక్ష్మణ్‌, నాయకులు చాకలి కుమార్‌, పూల్‌సింగ్‌, గోపాల్‌, రజినీకాంత్‌, రవి, కృష్ణమూర్తి, రైతులు నిరుద్యోగులు, యువకులు ఉన్నారు.

Updated Date - 2023-05-31T23:21:12+05:30 IST