8న ఆరోగ్య మహిళకు శ్రీకారం
ABN , First Publish Date - 2023-03-05T01:23:11+05:30 IST
అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వినూత్నం గా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా యంత్రాంగం
నిజామాబాద్ అర్బన్, మార్చి 4: అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం వినూత్నం గా ఆరోగ్య మహిళ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా తొలు త వంద కేంద్రాల్లో ఈనెల 8న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుందని ఆయన తెలిపారు. శనివారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారిలతో కలిసి ఆయన వీసీ ద్వారా కలెక్టర్‌లు, సీపీలు, ఇతర అదికారులతో పలు అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కలెక్టర్‌లకు సూచించారు. మహిళలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని క్యాన్సర్ నిర్దారణ, ఇతర డయాగ్నోస్టిక్ పరిక్షలతో పాటు మహిళల అనారోగ్య సమస్యలకు సంబందించి కీలకమైన 8రకాల వైద్య సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందిం చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అవసరమైన వారికి సూపర్ స్పె షాలిటీ వైద్యం అందించడం జరుగుతుందని ప్రతి మంగళవారం నిర్ణీత కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య పరిక్షలు నిర్వహించి వారికి వైద్య సేవలు అందించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ప్ర యోగాత్మకదశలో ఎంపిక చేసిన కేంద్రాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేయాలన్నారు. మహిళలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునేలా పెద్దఎత్తున ప్రచారం చేయాలన్నారు. ఇదిలా ఉండగా ఆకస్మిక గుండెపోటు మరణాలు నివారించాలనే లక్ష్యంతో వైద్యశాఖ చేపట్టిన సీపీ ఆర్ శిక్షణలో అన్ని వర్గాల వారిని భాగస్వాము లు చేయాలన్నారు. ప్రతీ జిల్లాకు ఐదుగురు చొప్పున శిక్షణ కొరకు ఎంపిక చే సిపంపడం జరిగిందని వారి ద్వారా అన్ని శాఖల ఉద్యోగు లు, ఆశ వర్కర్‌లు, అంగన్‌వాడి టీచర్లు, పంచాయతీ కార్యదర్శులందరికి సీపీఆర్ శిక్షణ అందే లా చూడాలని కలెక్టర్‌లకు సూచించారు. ఎలక్ర్టిక్ షాక్ ఇవ్వడం ద్వారా ఆకస్మిక గుండెపోటుకు గురైన వారిని కాపాడేందుకు వినియోగించే ఏఈడీ పరికరాల ను ప్రతీ జిల్లాకు తక్షణం రెండు చొప్పున పంపిస్తున్నామని, దీనిలో భాగంగా త్వరలోనే అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాలకు సమకూరుస్తున్నామన్నారు. అందత్వ నివారణే లక్ష్యంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని మరింత పకడ్బందిగా నిర్వహించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల కు సంబందించి వడ్డీలేని రుణాలను ప్రభుత్వం అందించనుందని అదేవిధంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు, పోడు భూముల పట్టాలు, జీవో నంబర్ 58, 59, 76, 118 అమలు, ఆయిల్‌పాం సాగు, తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. ఈ వీసీలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, పోలీసు కమిషనర్ నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, జిల్లా అటవీశాఖ అధికారి వికాస్‌మీన, తదితరులు పాల్గొన్నారు.