మన ఊరు-మన బడి పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-01-07T01:28:04+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి పనులకు సంబంధించి పనులు పూర్తయిన వాటికి వెంటనే బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత ఏఈలను ఆదేశించారు.

మన ఊరు-మన బడి పనుల బిల్లులు వెంటనే చెల్లించాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 6: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి పనులకు సంబంధించి పనులు పూర్తయిన వాటికి వెంటనే బిల్లులు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సంబంధిత ఏఈలను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు-మన బడి, స్వయం సహాయక సంఘాలకు, బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం, పల్లె ప్రకృతి, మినీబృహత్‌ పల్లె ప్రకృతివనాలు, పారిశుధ్యం, తదితర అంశాలపై అధికారులతో మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రతీ మండలంలో కనీసం రెండు పాఠశాలల్లో తక్షణమే పనులు పూర్తిచేయించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. పలు పాఠశాలల్లో పనులు పూర్తయినప్పటికీ బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతుండడంపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. నిధులు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పనులు చేసిన ఏజెన్సీలకు బిల్లులు ఎందుకు చెల్లించడంలేదని ఏఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాటికి పరిస్థితుల్లో మార్పురావాలని పద్ధతి మార్చుకోని వారిపై సస్పెన్షన్‌ వేటు తప్పదన్నారు. అన్ని గ్రామ పంచాయతీలు, ఆవాసా ప్రాంతాల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని అవసరమైన సామగ్రిని సోమవారం నాటికి సమకూర్చుకోవాలన్నారు. సంక్రాంతి నాటికి అన్ని క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీలో మరింత ప్రగతి సాధించాలని, హరితహారం కింద నాటిన మొక్కలను సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జడ్పీ సీఈవో గోవింద్‌, డీపీవో జయసుధ పాల్గొన్నారు.

అర్బన్‌పార్కు పనులను పూర్తి చేయాలి

మాక్లూర్‌, జనవరి6: మండలంలోని చిన్నాపూర్‌ గ్రామం వద్ద చేపడుతున్న అర్బన్‌పార్కు పనులు తుది దశలో ఉన్నందున మిగిలిన పనుల ను యుద్ధప్రతిపాదికన పూర్తిచేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నా రు. శుక్రవారం కలెక్టర్‌ అర్బన్‌ పార్కు పనులను పరిశీలించి అధికా రులను వివరాలు అడిగితెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి వికాష్‌మీన, ఎంపీడీవో భవాని శంకర్‌, ఫారెస్ట్‌ రెంజ్‌ అధికారి శ్రీనివాస్‌, హీమచందన, ఎంపీడీవోలు కాంతి, గోపి, అధికారులు ఉన్నారు.

పచ్చదనం పెంపొందించాలి

ఆర్మూర్‌టౌన్‌, జనవరి 6: జిల్లాలోని జాతీయ రహదారులకు ఇరువైపులా పచ్చదనం పెంపొందించే విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా శుక్రవారం మండలంలోని అంకాపూర్‌ గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌ నిర్వహణను ఆయన పరిశీలించారు. లోపాలను గమనించి తక్షణమే సవరించాలని అధికారులకు సూచించారు. రోడ్డుకు ఇరువైపులా పచ్చ దనంతో కూడిన వాతావరణం కల్పించాలని, దెబ్బతిన్న మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలని సూచించారు. అనంతరం అం కాపూర్‌ గ్రామశివారులోని పంట పొలాల్లో వరి నాట్లు వేస్తున్న వ్యవ సాయదారులతో ముచ్చడించారు. వారి బాగోగులను తెలుసుకొని పంట కు అయ్యే ఖర్యు, దిగుబడిల గురించి ఆరాతీశారు. కలెక్టర్‌ వెంట అదన పు కలెక్టర్‌ చిత్రమిశ్రా, సర్పంచ్‌ కిశోర్‌రెడ్డి, అఽధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-07T01:28:06+05:30 IST