2045 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

ABN , First Publish Date - 2023-02-06T23:28:51+05:30 IST

భారతదేశం 2045 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తున్నందని ప్రధాన వక్త లింగమూర్తి అన్నారు.

2045 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

కామారెడ్డిటౌన్‌, ఫిబ్రవరి 6: భారతదేశం 2045 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తున్నందని ప్రధాన వక్త లింగమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్‌కే కళాశాలలో సోమవారం స్వదేశీ జాగరణమంచ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బడ్జెట్‌ 21వ శతాబ్దానికి అనుగుణంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలన్నీ డాటాసైన్స్‌, కమ్యూనికేషన్స్‌,రోబో టెక్నాలజీ, యువతకు నైపుణ్యాలు, దేశం అభివృద్ధి చెందాలంటే రవాణా మార్గాల అభివృద్ధి జరగాలన్నారు. అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిందగా ఉందన్నారు. వ్యవసాయరంగానికి, దళితబంధుకి కేటాయించిన నిధులు సంతృప్తికరంగానే ఉన్నా, ఉన్నత విద్యారంగాన్ని పట్టించుకోకుండా యూనివర్సిటీలకు మౌలికవసతులకు రూ.500 కోట్లు మాత్రమే కేటాయించడం దూరదృష్టకరమని అన్నారు. కార్యక్రమంలో రాహుల్‌, నారాయణ, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:28:52+05:30 IST