నిజాంసాగర్‌కు పూర్వ వైభవం
ABN , First Publish Date - 2023-03-02T00:32:26+05:30 IST
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రధాయినిగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
ఫ కాళేశ్వరం నీటితో ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చాం
ఫ మల్లన్నసాగర్ కాలువలతో నిజాంసాగర్‌ను గోదావరి జలాలతో నింపుతున్నాం
ఫ సింగూరు నీటి కోసం ఇక్కడి రైతులు ఉద్యమించారు
ఫ తిమ్మాపూర్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
కామారెడ్డి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వరప్రధాయినిగా ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఆషామశిగా కట్టలేదని మల్లన్నసాగర్ కాలువల ద్వారా కాళేశ్వరం నీటిని తరలించి నిజాంసాగర్‌ను గోదావరి జలాలతో నింపుతున్నామన్నారు. ఇకపై నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఆయ కట్టు పంటలన్నీ ఎప్పుడు పచ్చగానే ఉంటాయని కేసీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల ద్వారా తెలంగాణ రాష్ట్రా న్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దామని, రెండు సీజన్‌లకు రైతులు పంటలు పండించుకునేలా సాగు నీటిని అంది స్తున్నామని బాన్సువాడ నియోజకవర్గంలో రూ.1500ల కోట్ల విలువ చేసే రైతులు పంటను పండించడమే దీనికి నిదర్శనమన్నారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో గల తిరుమల దేవస్థానం బ్రహ్మోత్సవాలు, వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక హెలీప్యాడ్‌లో సీఎం కేసీఆర్ బాన్సువాడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సు లో తిరుమల ఆలయానికి చేరుకుని వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశంలో పని చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇతర ఎమ్మెల్యేలతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నిరహార దీక్ష చేపట్టినప్పుడు అప్పటి స్థితిగతుల నుంచి తెలుసుకోవడానికి తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. మంజీరా నదిపై నిజాంసాగర్‌కు అనుబంధంగా దేవునూర్ ప్రాజెక్ట్‌ను 50 టీఎంసీల సామర్థ్యంలో తలపెట్టారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాని సామర్థ్యం 30 టీఎంసీలకు కుదించి సింగూరు ప్రాజెక్టు కట్టారని అన్నా రు. అప్పటి మెదక్, నిజామాబాద్ సరిహద్దులో ఉన్న సింగూరు ప్రాజెక్ట్ శంకుస్థాపనకు తమకే ప్రయోజనం కలుగుతుందనే తలంపుతో నిజామాబాద్ ప్రజలే ఎక్కువ గా తరలివచ్చారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు సింగూరు నుంచి హైదరాబాద్‌కు, ఆంధ్రకు మంచినీరు అందించే పేరుతో నీటిని తరలించి నిజామాబాద్‌లో పంటలు ఎండినా కూడా సాగునీరు అం దించలేదని అన్నారు. ప్రతీ పంటకు సింగూరు, నిజాంసాగర్ నీటి కోసం ఇక్కడి ఎమ్మెల్యేలు, రైతులు యుద్ధం చేసేవారని అన్నారు. సింగూర్‌పై ఆధారపడిన ఘన్‌పూర్ ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వకపోవడం దారుణ సమస్యగా తాను భావించానని అన్నారు. ఆ సమయంలో ఇలాంటి ఎన్నో సన్నివేశాలు చూశానన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టడానికి న న్ను ప్రేరేపించిన కారణాల్లో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లు కూడా ఒక బలమైన కారణమన్నారు.
తిరుమల ఆలయాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి
బీర్కూర్ తిరుమల ఆలయానికి గతంలో వచ్చినప్పుడు మామూలుగా ఉండేదని కేసీఆర్ అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న వెంకన్న ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం తరపున రూ.23 కోట్ల నిధులు కేటాయించి ఆ దిశగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశామన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన మిత్రులతో కలిసి ఈ సత్కార్యాన్ని పూర్తి చేశారన్నారు. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని పుణ్యక్షేత్రంగా మార్చేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందన్నారు. ప్రజల సమగ్ర అవసరాలను తీర్చేవిధంగా ఈ పుణ్యక్షేత్ర అభివృ ద్ధి పనులను పూర్తి చేయడానికి మరో రూ.7 కోట్లను మం జూరు చేస్తున్నానని కేసీఆర్ ప్రకటించారు. శ్రీవారి కరుణ, దయ కేవలం బాన్సువాడ మీదనే కాదు యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానన్నా రు. పంటలతో ఈ ప్రాంతంతో సుభిక్షంగా వర్ధిల్లాలని నేను హృదయ పూర్వకంగా స్వామి వారిని ప్రార్థిస్తున్నానని అన్నారు.
స్పీకర్ పోచారంపై సీఎం కేసీఆర్ పొగడ్తలు
బాన్సువాడ అభివృద్ధి కోసం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కేసీఆర్ తన పొగడ్తలతో ముంచెత్తారు. రైతుల బాధలు తెలుసు కాబట్టే స్పీకర్ నిజాంసాగర్‌కు కాళేశ్వరం నీటిని మళ్లించి, తన నియోజకవర్గానికి రెండు లిఫ్ట్ ఇరిగేషన్‌లను మంజూరు చేయించుకున్నారన్నారు. 1లక్ష 50వేల ఎకరాలకు సాగునీరు అంది స్తున్నారన్నారు. వందల కోట్లతో నియోజకవర్గాన్ని మరిం త అభివృద్ధి చేశారన్నారు. ఇటీవల బాన్సువాడ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి సైతం అఖిల భారత గుర్తింపు తీసుకువచ్చిన ఘనత స్పీకర్‌కే దక్కుతుందన్నారు. అసెం బ్లీ నడుస్తున్న సమయంలో స్పీకర్ నాకు ఫోన్ చేసి నా చిన్ననాటి స్నేహితుడు బాన్సువాడలో చనిపోయాడని అతని అంత్యక్రియలకు ఖచ్చితంగా వెళ్లాలని చెప్పడంతో తానే ప్రత్యేక హెలీకాప్టర్‌ను సమకూర్చి పంపానని తెలిపారు. వయస్సు దృష్టిలో పెట్టుకోకుండా శ్రీనివాస్‌రెడ్డి ప్రజాసేవ చేయాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.
నా ప్రాణం ఉన్నంత వరకు మీ వెంటే : స్పీకర్
ప్రస్తుతం నా వయస్సు సహకరించడం లేదు అయినా నా ప్రాణం ఉన్నంత వరకు సీఎం కేసీఆర్ వెంటే ఉంటా నంటూ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. బాన్సువాడ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వందల కోట్ల నిధులను మంజూరు చేసి అభివృద్ధికి ఎం తో దోహదపడ్డారని అన్నారు. ఎక్కడో ఉన్న కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను తీసుకువచ్చి నిజాంసాగర్‌ప్రాజెక్ట్‌ను నింపి లక్షా 50వేల ఆయకట్టుకు సాగు నీటిని కేసీ ఆర్ అందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని మరో 50వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.270కోట్లతో రెండు లిఫ్ట్ ఇరిగేషన్‌లను మంజూ రు చేశారన్నారు. రూ.1200 కోట్లతో 11వేల డబుల్ బెడ్‌రూం ఇళ్లను కేసీఆర్ నిర్మించారని అన్నారు.
కల్యాణోత్సవంలో కేసీఆర్ దంపతులు
బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లో గల తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యా రు. ఆలయంలోని శ్రీవారి కల్యాణ మహోత్సవంలో కేసీ ఆర్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రెండు కిలోల స్వర్ణ కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దాతలు అలంకరించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి దంపతులు కేసీఆర్ దంపతులను నూతన పట్టు వస్త్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, రాజ్యసభ సభ్యు
డు సంతోష్, సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యే లు హన్మంత్‌షిండే, బిగాల గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, షకీల్, సురేందర్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, రాష్ట్ర ఉర్ధూ అకాడమీ చైర్మన్
ఎంకే ముజిబోద్దిన్, జడ్పీ చైర్మన్‌లు దాదాన్నగారి విఠల్‌రావు, దఫేదార్ శోభ, ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పోచారం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.