వచ్చేనెలలో చంద్రబాబు రాక

ABN , First Publish Date - 2023-01-24T00:43:16+05:30 IST

జిల్లాలో ఫిబ్రవరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీ య అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని, బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ దిశా నిర్దేశం చేశారు.

వచ్చేనెలలో చంద్రబాబు రాక

బహిరంగ సభకు ఏర్పాట్లు చేయాలి : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌

సుభాష్‌నగర్‌, జనవరి 23: జిల్లాలో ఫిబ్రవరిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీ య అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారని, బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ దిశా నిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీ ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జిల్లా పార్లమెంట్‌ అధ్యక్షులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతంపై పలువురితో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని గతంలో ఉన్న సభ్యత్వాలను యథావిథిగా కొనసాగించాలని సూచించారు. ఈ స మావేశంలో టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు దేగాంయాదాగౌడ్‌, పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ జ్యోతి నారాయణ, మోహన్‌దాస్‌, మానూక ప్రవీన్‌, అధ్య క్షుడు హరిశ్రీరామమూర్తి, యువత అధ్యక్షుడు శ్రీనివాస్‌బాబు, అర్బన్‌ నాయకులు అంబికా సత్యనారాయణ, రాజు, అర్బన్‌ అధ్యక్షుడు చందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-24T00:43:16+05:30 IST