8ఏళ్లలో ఎంతో అభివృద్ధి
ABN , First Publish Date - 2023-01-29T01:06:00+05:30 IST
ప్రభుత్వం నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలను ఈ ఎనిమిది ఏళ్లలో బాగా అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్‌కు రూ.936 కోట్ల నిధుల ఖర్చు
బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున నిధులు
నూతన కలెక్టరేట్‌కు అదనంగా రూ.100 కోట్లు మంజూరు
రూ.50 కోట్ల వ్యయంతో కళాభారతి నిర్మాణానికి సీఎం ఆదేశాలు
వచ్చే నెలలో ఐటీ హబ్‌ను ప్రారంభిస్తాం
జిల్లాకేంద్రంలో పలు అబివృద్ధి పనుల పారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
నిజామాబాద్, జనవరి 28(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలను ఈ ఎనిమిది ఏళ్లలో బాగా అభివృద్ధి చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. కార్పొరేషన్ పరిదిలో శుక్రవారం కళాభారతి శంకుస్థాపనతో పాటు ఆర్‌యూబీ ప్రారంభోత్సవం చేశారు. ఈ ఒక్క కార్పొరేషన్‌కే ఇప్పటి వరకు ఎనిమిది ఏళ్లలో రూ.936 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఇవేకాకుండా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సమయంలో సీఎం కేసీఆర్ అదనంగా రూ.100 కోట్లు మంజూరు చేశారన్నారు. వీటిని కూడా నగరంలో వివిద పనుల కోసం వి నియోగిస్తున్నామన్నారు. నగరంలో విలీనమైన డివిజన్‌లతో పాటు ఇతర పనుల కు ఉపయోగిస్తున్నామన్నారు. అధునాతనమైన మార్కెట్ నిర్మాణంతో పాటు రజకులు, నాయీబ్రాహ్మణుల కోసం సీఎం ప్రకటించిన నిధుల నుంచి మూడు కోట్ల చొప్పున వెచ్చిస్తున్నామన్నారు. ఇందూరు కవులకు, కళాకారులకు పుట్టినిళ్లు అని మంత్రి అన్నారు. ఎన్నో సాహితి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఇవన్ని తెలిసిన సీఎం కేసీఆర్ సమీక్షించడంతో పాటు రూ.50 కోట్లతో కళాభారతి నిర్మా ణం చేయాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ కళాభారతికి డిజైన్ కూడా సీఎం కేసీఆర్ ఎంపిక చేశారన్నారు. అన్ని సౌకర్యాలతో దీనిని నిర్మించేందుకే ఈ శంకుస్థాపన చేశామన్నారు. నగరాభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారన్నారు. వారికి కావాలంటే ఖర్చుపెట్టిన లెక్కల న్ని అంకెలతో సహా అందిస్తామన్నారు. నిజామాబా ద్ నగరం అభివృద్ధి చెందుతుందని మరింత అభివృద్ధి చెందేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో నగరంలో నిర్మిస్తున్న ఐటీ పార్కు ప్రారంభిస్తామన్నా రు. ఈ పార్కు వల్ల ఇక్క డి వారికి ఉద్యోగాలు వ స్తాయన్నారు. ఇదేకాకుండా ఐటీ హబ్ పక్కనే న్యాక్ భవన నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఇది పూర్తికాగానే న్యాక్ అకాడమి ప్రారంభించడంతో పాటు యువతకు వివిధ ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, ఫిట్టర్‌తో పాటు ఇతర కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు ఉపాది కల్పిస్తామన్నా రు. భవన నిర్మాణం రంగంలో కావాల్సిన శిక్షణ అందిస్తామన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొ ప్పున మంజూరు చేస్తున్నామన్నారు. ఈ మున్సిపాలిటిల పరిదిలో అన్ని రకాల అ భివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు ఆరోపణలకే మిగిలిపోకుండా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, జీవన్‌రెడ్డి, షకీల్, మల్లయ్యయాదవ్, ఎమ్మెల్సిలు రాజేశ్వర్‌రావు, వీజీగౌడ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్ నీతుకిరణ్, రాష్ట్ర మహిళ ఆర్థిక సహకార సంస్థ చైర్‌పర్సన్ ఆకుల లలిత, డిసీసీబీ బ్యాంక్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇల్లెందు రాజేశ్వర్ ఉన్నారు.
ఇందూరు కళాభారతి నిర్మాణానికి శంకుస్థాపన
సుభాష్‌నగర్: ఇందూరు కళాభారతి నిర్మాణానికి ఐటి పురపాలక శా ఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శంకుస్థాపన చేశారు. జిల్లాకేంద్రంలోని పాత కలెక్టరేట్ ఆవరణలో శనివారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ చేశారు. శిలాఫలకానికి రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన మలి ఉద్యమంలో జిల్లా ముందు వరుసలో నిలుస్తూ యా వత్ తెలంగాణకు మార్గదర్శకంగా నిలిచిందని గుర్తు చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో మెజార్టీస్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని జడ్పీ చైర్మన్‌ను కూడా గెలుచుకుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానమన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలనే సంకల్పంతో ఇటీవలే ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారని గుర్తు చేశారు. దీనిలో భాగంగా జిల్లా ప్రజల కు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్, బోధన్ రూరల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్‌అమీర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీగౌడ్, రాష్ట్ర మహిళా సహకార సంస్థ చైర్‌పర్సన్ ఆకుల లలిత, మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు
కాకతీయ సాండ్ బాక్స్ సదస్సులో మంత్రి కేటీఆర్
నిజామాబాద్ అర్బన్: రాష్ట్రంలో రైతుల జీవితాల్లో కేసీఆర్ ప్రభుత్వం కొత్త వెలుగులు నింపుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగర శివారులో ని భూంరెడ్డి కన్వెన్షన్ హాల్‌లో కాకతీయ సాండ్ బాక్స్ నిర్వహించిన రైతు లతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరోనా సమయంలో దేశంలోని ప్రజలంతా తల్లడిల్లుతుంటే.. రైతులకు ఇబ్బందులుకాకుండా ఊరురా కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రైతులు పండించిన ధాన్యం అంతా కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో రైతుల కోసం ఐదు వేల క్లస్టర్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్లస్టర్‌ల ద్వారా రైతులకు కావాల్సిన స మాచారం అందించడంతో పాటు అధునాతన పంటలపై అవగాహ కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మిషన్ కాకతీయ కింద 60వేల చెరువులను పు నరుద్ధరించామన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచామన్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు పునరుజీవనం చేశామన్నారు. దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం నిర్మాణం చేసి రైతులకు సాగునీటిని అందిస్తామన్నారు. రాష్ట్రంలో నిర్మించిన కొత్త ప్రాజెక్టుల ద్వారా 24గంటల కరెంటు అందించడం వల్ల మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వ చ్చిందన్నారు. రైతుబంధు, రైతుబీమా వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఈ సదస్సులో దేశ్‌పాండే ఫౌండేషన్ కో ఫౌండర్ రాజురెడ్డి, ఫణీంద్ర, కలెక్టర్, కాకతీయ సాండ్‌బాక్స్ సీఈవో మనీష్ జైష్పాల్ పాల్గొన్నారు.
మంత్రి కేటీఆర్ పర్యటన సైడ్‌లైట్స్
ఉదయం 9.37 గం.లకు నూతన కలెక్టరేట్ వద్ద హెలీప్యాడ్‌కు
చేరుకున్న మంత్రి కేటీఆర్
9.45 గం.లకు కాన్వాయ్‌లో బయలుదేరి 10గంటలకు
భూమారెడ్డి కన్వెన్షన్‌కు చేరుకున్న కేటీఆర్
10.05 గం.లకు నాయకులు, అధికారుల ఘన స్వాగతం
11.15 గం.ల వరకు అక్కడే ఏర్పాటు చేసిన కాకతీయ సాండ్‌బాక్స్
ప్రోగ్రాంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
11.30 గం.లకు రైల్వే అండర్ బ్రిడ్జి ప్రారంభం
11.50 గం.లకు కళాభారతి నిర్మాణ పనులకు శంకుస్థాపన
12.40 గం.లకు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి కేటీఆర్
01.55 గం.లకు ఎంపీ సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి,
గణేష్‌గుప్త, కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య
యాదవ్‌లతో కేటీఆర్ తిరుగు పయనం
మంత్రి కేటీఆర్ పర్యటన ప్రశాంతం
ఖిల్లా: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటన శనివారం ప్రశాంతంగా ముగిసింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం నిజామాబా ద్ నగరానికి హెలిక్యాప్టర్‌లో వచ్చిన కేటీఆర్‌కు పోలీసు కమీషనర్ కేఆర్.నాగరాజు నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు చేపట్టారు. హెలిప్యాడ్ వద్ద ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు. ఆయన వెళ్లే కాన్యాయ్ దారిలో భారీగా పోలీసులను మోహరించారు. పర్యటనలో ఎటువంటి ఘటనలు జరుగకుండా అంతటా పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలు ప్రతిపక్ష పార్టీల నేతలను ముందస్తుగానే అరెస్టు చేశారు.