Water fall: సముద్రపు నీరు మాదిరిగానే నీలి రంగులో.. తెలంగాణలో మరో జలపాతం..
ABN , First Publish Date - 2023-07-23T16:24:08+05:30 IST
ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో మరో అద్భుత జలపాతం శనివారం వెలుగులోకి వచ్చింది. ‘గుండం జలపాతం’గా (Gundam Water fall) పిలుస్తున్న ఈ జలపాతం ఎత్తు తక్కువగానే ఉన్నప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రెండు గుట్టల మధ్య నుంచి నీరు జాలువారుతోంది.
వాజేడు: ములుగు జిల్లాలోని వాజేడు మండలంలో మరో అద్భుత జలపాతం శనివారం వెలుగులోకి వచ్చింది. ‘గుండం జలపాతం’గా (Gundam Water fall) పిలుస్తున్న ఈ జలపాతం ఎత్తు తక్కువగానే ఉన్నప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రెండు గుట్టల మధ్య నుంచి నీరు జాలువారుతోంది.
అంతేకాదు సముద్రపు నీరు లాగే నీలి రంగులో ఉండడం మరింత ఆకర్షణీయంగా ఉంది. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అరుణాచలపురానికి 1 కిలోమీటర్ దూరంలోనే ఈ జలపాతం ఉంది.
కాగా ఇప్పటికే ఇదే వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న బొగత జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇటివల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలపాతాలు మరింత ఆహ్లాదకరంగా మారి కనివిందు చేస్తున్న విషయం తెలిసిందే.