Hero Navdeep: హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసుల నోటీసులు?

ABN , First Publish Date - 2023-09-15T13:15:21+05:30 IST

డ్రగ్స్ కేసులో (Drugs case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ వాడిన నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరో నవదీప్‌కు (Hero Navdeep) నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.

Hero Navdeep: హీరో నవదీప్‌కు నార్కోటిక్ పోలీసుల నోటీసులు?

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో (Drugs case) పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే డ్రగ్స్ వాడిన పలువురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇక డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరో నవదీప్‌కు (Hero Navdeep) కూడా నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది. పోలీసులకు అందుబాటులోనే ఉన్నానని నవదీప్ గురువారం తెలిపిన విషయం విధితమే. మరోవైపు షాడో సినిమా యూనిట్‌మెన్ ఉప్పలపాటి రవి ఇంకా పరారీలోనే ఉన్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా పలు పబ్బులపైనా నార్కోటిక్ పోలీసుల నిఘా పెట్టారు. గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో డ్రగ్స్ విక్రయాలపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసుల గాలిస్తున్నారు. కేపీ చౌదరి లిస్ట్‌లోనూ మోడల్ శ్వేతా పేరు ఉండడం గమనార్హం. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసుల వేటాడుతున్నారు. కేపీ చౌదరి లిస్ట్‌తో పాటు గతంలో బెంగళూరు డ్రగ్స్ కేస్‌లోనూ కలహార్ రెడ్డి పేరు ఉండడం గమనార్హం.


పబ్బుల మాటున డ్రగ్స్ విక్రయాలు

పబ్బుల మాటున డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టుగా తాజా పరిణామాలనుబట్టి స్పష్టమవుతోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పబ్బుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం ఇందుకు తార్కాణంగా నిలిచింది. హైటెక్స్‌లోని స్నాట్ (SNORT) పబ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం స్నాట్ (snort) పబ్ ఓనర్ సూర్య పరారీలో ఉన్నాడు. పబ్‌కి వచ్చే కస్టమర్లకు సూర్య డ్రగ్స్ విక్రయిస్తున్నాడని బయటపడింది. జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బ్రిస్టో పబ్‌లోనూ డ్రగ్స్ విక్రయాలు జరిగాయి. దీంతో పబ్ ఓనర్ అర్జున్ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. సూర్య, అర్జున్‌ల కోసం పోలీసుల ముమ్మరంగా గాలిస్తున్నారు. న్యూసెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా స్నాట్ పబ్ మారిందనే ఆరోపణలున్నాయి. గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. 2 నెలల పాటు స్నార్ట్ పబ్ సీజ్‌లోనే ఉంది. అయినప్పటికీ తీరు మార్చుకోలేదు. ఇప్పటివరకు డ్రగ్స్ కన్సూమింగ్ అడ్డాలుగా ఉన్న పబ్స్ ఇప్పుడు డ్రగ్స్ విక్రయ కేంద్రాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

Updated Date - 2023-09-15T13:15:21+05:30 IST