జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస

ABN , First Publish Date - 2023-03-25T23:52:56+05:30 IST

జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ నగేష్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస
పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న నగేష్‌

చైర్మన్‌ సందీప్‌రెడ్డి, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ నగేష్‌ మధ్య మాటల యుద్ధం

పోడియం వద్ద బైఠాయించి, నగేష్‌ వాకౌట్‌

భువనగిరి రూరల్‌, మార్చి 25: జడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జడ్పీ చైర్మన్‌ సందీ్‌పరెడ్డి, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ నగేష్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.దీనికి నిరసనగా పోడియం వద్ద బైఠాయించిన నగేష్‌ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఫీడర్‌ చానెల్‌ను బునాదిగాని కాల్వలో అనుసంధానం చే స్తే భూసేకరణ వ్యయం తగ్గుతుందని జడ్పీ కాం గ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ డాక్టర్‌ కుడుదుల నగేష్‌ అధికారులను అడిగారు. జడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి మధ్యలో జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం వాగ్వాదం జరిగింది. అంతకుముందు జరిగిన సమావేశంలో జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ జిల్లాలో అసంపూర్తిగా నిలిచిన రహదారుల పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.పెండింగ్‌ బిల్లులు చెల్లించడంలో జాప్యం జరుగుతోందని, దీంతో కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో ముందుకు రావడం లేదని పీఆర్‌ ఈఈ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాగా ఒప్పందం చేసుకొని మూడు నెలలు గడిచినా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లి్‌స్టలో పెట్టాలని పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ప్రభుత్వం నుంచి విడుదల చేసిన పరిహారం డబ్బులను బాధిత రైతులకు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీలు సు బ్బూరు బీరుమల్లయ్య, ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీలు శ్రీశైలం,నరాల నిర్మల కోరారు. రైతు వేదికలు నిరుపయోగంగా మారాయని ప్రతి మండల, శుక్రవారం లో రైతులతో సమావేశం నిర్వహించడం లేదని డీఏ వో అనురాధ దృష్టికి తీసుకెళ్లారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల వేసిన సీసీ రోడ్లు, నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నాణ్యతతో అభివృద్ధి పను లు చేపట్టే విధంగా చూడాలని భువనగిరి ఎంపీపీ నిర్మల కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారీ, శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీసీఈవో సీహెచ్‌ కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:52:56+05:30 IST