ఈ ఏడాది మిర్చి దిగుబడేదీ?

ABN , First Publish Date - 2023-03-19T00:15:28+05:30 IST

మిరప పంటకు లక్షల రూపాయలు వెచ్చించి రైతులు సాగు చేస్తే సరైన దిగుబడి రావడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అర్వపల్లి మండలంలో 3.500 ఎకరాల్లో మిరప పంటలను సాగుచేశారు.

ఈ ఏడాది మిర్చి దిగుబడేదీ?
లక్ష్మీనాయక్‌తండాలో కాతలేని మిరపపంట

అర్వపల్లి, మార్చి 18 : మిరప పంటకు లక్షల రూపాయలు వెచ్చించి రైతులు సాగు చేస్తే సరైన దిగుబడి రావడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. అర్వపల్లి మండలంలో 3.500 ఎకరాల్లో మిరప పంటలను సాగుచేశారు. ఒక్కో ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు సాగు కోసం ఖర్చు చేశారు. అయితే ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. కానీ ఆకుముడత, ఎర్రపచ్చ తెగులు సోకడంతో పంటల దిగుబడులు సరిగా రాక నాలుగు క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తోంది. దీంతో ఎకరానికి లక్ష రూపాయల దాకా రైతులు నష్టపోతున్నారు. మండలంలో సూర్యనాయక్‌తండా, కోడూరు, పర్సాయపెల్లి, లోయపెల్లి, జాజిరెడ్డిగూడెం గ్రామాల్లో రైతులు మిరప పంటలను ఎక్కువ సాగు చేసి దిగుబడులు లేక ఈఏడాది తీవ్రంగా నష్టపోయి రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం నీరు నిల్వ ఉండే నల్లరేగడి భూముల్లో మిరుప పంటలు ఎక్కువగా సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు.

మిరప పంట వేసి తీవ్రంగా నష్టపోయా

రెండు ఎకరాల్లో రూ.3 లక్షలు ఖర్చు చేసి మిరప పంట సాగు చేశా. రెండు ఎకరాల పేరుమీద లక్ష రూపాయలు కూడా రాలేదు. రెండు లక్షలు నష్టపోయా. ఆకుముడుత తెగులు సోకింది. పంటకు నీరు పెట్టి మేకలను, గొర్రెలను మేపుతున్నా.

ఫ లింగానాయక్‌, లక్ష్మినాయక్‌తండా రైతు

Updated Date - 2023-03-19T00:15:28+05:30 IST