పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2023-03-05T00:32:56+05:30 IST
పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధీరవత్ రవినాయక్ డిమాండ్ చేశారు.
మఠంపల్లి, మార్చి 4: పోడు భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధీరవత్ రవినాయక్ డిమాండ్ చేశారు. మఠంపల్లిలో శనివారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. దశాబ్దా కాలంగా పోడు భూములు సాగు చేస్తున్న రైతుల గ్రామాల్లో ఎఫ్‌ఆర్‌సీ కమిటీ ద్వారా దరఖాస్తులు స్వీకరించారని గుర్తుచేశారు. సుదీర్ఘకాలం పొరాటాల ఫలితంగా మంత్రి, చైర్మన్, కలెక్టర్ కన్వీనర్‌గా జిల్లా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. సూర్యాపేట జిల్లాలో వంత ఎకరాల్లో ఉన్న రైతులను గుర్తించకుండా ఎల్‌డీఎల్‌సీ తీర్మానంలో 83ఎకరాల్లో 84మంది రైతులు గుర్తించడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు బాలునాయక్, భూక్య పాండునాయక్, వినోద్‌నాయక్ పాల్గొన్నారు.