ప్రతీ ఉపాధ్యాయుడిని కాపాడుకుంటాం

ABN , First Publish Date - 2023-07-26T00:27:56+05:30 IST

ప్రతీ ఉపాధ్యాయుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారెడ్డి అంజిరెడ్డి అన్నారు.

ప్రతీ ఉపాధ్యాయుడిని కాపాడుకుంటాం
సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న అంజిరెడ్డి, భిక్షంగౌడ్‌

నల్లగొండ టౌన, జూలై 25 : ప్రతీ ఉపాధ్యాయుడిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని పీఆర్‌టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మారెడ్డి అంజిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పానగల్‌, మర్రిగూడ, చర్లపల్లి హైస్కూళ్లలో పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిష్కృత సమస్యలపై త్వరలో పోరాటం చేసి సాధిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కందిమల్ల కృష్ణారెడ్డి, శంకర్‌, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్‌, అండం శ్రీనివా్‌సలు, శివకుమార్‌, యాదయ్య, చనగాని యాదయ్య, రేపాక నర్సింహారెడ్డి, పోలె వెంకటయ్య, యాదగిరిరెడ్డి, జనగాం వెంకన్నగౌడ్‌, వీరమల్ల శ్రీనివాస్‌, కడారి కృష్ణ. వనం లక్ష్మీపతి, పూల లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-26T00:27:56+05:30 IST