Share News

మేం ప్రజా సేవకులం

ABN , Publish Date - Dec 24 , 2023 | 12:14 AM

తాము పాలకులం కాదని, ప్రజలకు సేవకులమని గృహ నిర్మాణ, రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టు వద్ద మో డల్‌ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రావ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో మా ట్లాడారు.

మేం ప్రజా సేవకులం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో అవినీతిపై విచారణ చేయిస్తాం

హుజూర్‌నగర్‌ సభలో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌

హుజూర్‌నగర్‌, డిసెంబరు 23: తాము పాలకులం కాదని, ప్రజలకు సేవకులమని గృహ నిర్మాణ, రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం హుజూర్‌నగర్‌ పట్టణ పరిధిలోని ఫణిగిరి గట్టు వద్ద మో డల్‌ కాలనీ ఇళ్లను మంత్రి ఉత్తమ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకట్రావ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో మా ట్లాడారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దూరదృష్టితో 12 ఏళ్ల క్రితమే దేవాదాయశాఖ భూములు కొనుగోలు చేసి గృహ నిర్మాణశాఖ ద్వారా 3వేల ఇళ్లు నిర్మించడం గొప్ప విషయమన్నా రు. రాష్ట్రంలో మోడల్‌ కాలనీ పూర్తి చేసి మొట్టమొదటి సారిగా పేదలకు పంపిణీ చేసేది హుజూర్‌నగర్‌ మోడల్‌ కాలనీలోనని అన్నారు. కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపించి పేదలకు పంచుతామన్నారు. అసెంబ్లీలో రంకెలు వేసే ఆంబోతుల ముక్కులకు కళ్లెంవేసి గాడిన కట్టేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు. జిల్లాలో కనీసం 240 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కూడా గత ప్రభుత్వం పేదలకు పంచలేదన్నారు. ఏ ఊరికి వెళ్లినా కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లే కన్పిస్తున్నాయన్నారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్‌ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసి రూ.6.71లక్షల కోట్లు అప్పుచేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేస్తామన్నారు. అసెంబ్లీలో ఆర్థిక శ్వేత పత్రం, 24 గంటల విద్యుత్‌పై కాంగ్రెస్‌ మంత్రులు మాట్లాడినప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తల నేలకేశారన్నారు. మూడు నెల ల్లో హుజూర్‌నగర్‌లో 2వేల గృహాల జీప్లస్‌-1 మోడల్‌ కాలనీని పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ భవన్‌లో స్వేద పత్రాన్ని కేటీఆర్‌ విడుదల చేయడం శోచనీయమన్నారు. రాష్ట్రాన్ని దోచుకొని, దాచుకొని ఆర్థికంగా నిర్వీర్యం చేసిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సంపద పెంచామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కుంగిపోవడానికి కారణమేంటో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఉత్తమ్‌ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆపద కాలంలో కాంగ్రెస్‌ను ఉత్తమ్‌ ఆదుకున్నారని పొగడ్తలతో ముంచెత్తారు. గృహ నిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి మొదట హుజూర్‌నగర్‌కు రావాలని వారం రోజులుగా పట్టుబట్టి ఇక్కడి తీసుకొచ్చారన్నారు. ఉత్తమ్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో కేసీఆర్‌ రూ.20కోట్లతో పూర్తయ్యే మోడల్‌ కాలనీని పూర్తి చేయకుండా గాలికి వదిలేశారన్నారు. మూడు నెలల్లో మోడల్‌కాలనీ పూర్తి చేసి ఉత్తమ్‌, ఇక్కడి ప్రజల కోరిక తీరుస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రియాంక, వెంకటరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గెల్లి అర్చనరవి, ఎంపీపీ గూడెపు శ్రీనివాసు, భూక్యా గోపాల్‌, మోతీలాల్‌, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, కొట్టె పద్మ, మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, సాముల శివారెడ్డి, సంపత్‌రెడ్డి, భాస్కర్‌, సతీష్‌, విజయ్‌, కుంట సైదులు, ఉపేంద్ర, ఓరుగంటి నాగేశ్వరరావు, పుల్లయ్య, శ్రీనివాస్‌, బెంజిమెన్‌, పాల్గొన్నారు.

అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజాపాలన : ఉత్తమ్‌

అవినీతికి ఆస్కారం లేకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుందని నీటిపారుదల, పౌరసరఫరా ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, ఖర్గే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం నియంతృత్వ, దుర్మార్గ పాలన చేసిందన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఎత్తిపోతల పథకాలపై సమీక్షలు నిర్వంచి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మోడల్‌ కాలనీ ఇళ్లు పూర్తిచేసి పంచుతామని, అక్కడ ఖాళీగా ఉన్న స్థలాల్లో కూడా నిర్మాణాలు చేపడతామన్నారు. అధికారులు నిజాయితీగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. త్వరలోనే రూ.500కే సిలిండర్‌ అందిస్తామని, ఆర్టీసీలో ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. డిసెంబరు 27న ప్రభుత్వం తెలంగాణ సమాజానికి తీపి కబురు అందించనుందన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 12:14 AM