ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

ABN , First Publish Date - 2023-01-26T01:55:39+05:30 IST

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని కోదాడ ఆర్డీవో ఎల్‌.కిషోర్‌కుమార్‌ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో విద్యార్థులకు ఓటు హక్కుపై ఆర్డీవో అవగాహన కల్పించారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
కోదాడలో అధికారులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న ఆర్డీవో ఎల్‌.కిషోర్‌కుమార్‌

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, జనవరి 25: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని కోదాడ ఆర్డీవో ఎల్‌.కిషోర్‌కుమార్‌ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని బుధవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కోదాడ పట్టణంలోని బాలుర హైస్కూల్‌లో విద్యార్థులకు ఓటు హక్కుపై ఆర్డీవో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవ త్సరాలు నిండిన పత్రి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ఎలాంటి ప్ర ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని కోరారు. అనంతరం అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి నూతన ఓటరు గుర్తింపు కార్డులను కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోదాడ తహసీల్దార్‌ శ్రీనివాస్‌శర్మ, మునిసి పల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో విజయశ్రీ, ఎంఈవో సలీంషరీఫ్‌, ఎలక్షన్‌ డీటీ సంధ్యారాణి, రెవెన్యూ అధికారి విజయేందర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకట నగేష్‌, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.

- కోదాడలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఎన్‌ఎస్‌ఎస్‌ అధి కారి వి.వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ రేపాల శ్రీనివాస్‌, పాల్గొన్నారు.

-అర్వపల్లి మండం కుంచమర్తి గ్రామంలో ఎంపీపీ మన్నె రేణుక, అర్వపల్లి ప్రాథమిక పాఠశాలలో జడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌ యాదవ్‌ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. నాగారంలో తహసీల్దార్‌ కార్యాల యంలో సిబ్బందితో తహసీల్దార్‌ హరిచంద్రప్రసాద్‌, ఎంపీపీ కూరం మణివెంకన్న, ఎంపీడీవో శోభరాణి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్ర మంలో ఏపీవో శ్రీనివాస్‌, రవికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు

Updated Date - 2023-01-26T01:55:42+05:30 IST