భూదానోద్యమ పితామహుడు వినోబాభావే

ABN , First Publish Date - 2023-09-12T00:03:38+05:30 IST

భూదానోద్యమపిత ఆచా ర్య వినోబాభావే కృషి ఫలితంగానే భూదానోద్యమానికి పోచంపల్లిలో బీజం పడిందని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి అన్నారు.

భూదానోద్యమ పితామహుడు వినోబాభావే
వినోబాభావే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి

భూదాన్‌పోచంపల్లి,సెప్టెంబరు 11: భూదానోద్యమపిత ఆచా ర్య వినోబాభావే కృషి ఫలితంగానే భూదానోద్యమానికి పోచంపల్లిలో బీజం పడిందని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మి అన్నారు. వినోబా సేవా సంఘం ఆధ్వర్యంలో భూదాన్‌పోచంపల్లిలో సోమవారం భూదానోద్యమపిత ఆచార్య వినోబాభావే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వినోబాజీ, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. భూదానోద్యమ చారిత్రక నేపథ్యంతో పోచంపల్లికి నేడు ఖండాంతర ఖ్యాతి లభిస్తోందన్నారు. భూదానోద్యమానికి నాంది పలికిన ఆచార్య వినోబాభావే స్మృ తి చిహ్నంగా ఇక్కడ వినోబామందిరం నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వినోబా సేవా సంఘం అధ్యక్షుడు కొయ్యడ నర్సింహగౌడ్‌,ప్రధాన కార్యదర్శి వేశాల మురళి, భారత భాస్కర్‌, గౌడసంఘం అధ్యక్షుడు గునిగంటి మల్లే్‌షగౌడ్‌, ఆటిపాముల మచ్చేందర్‌, పొట్టబత్తిని శేఖర్‌, ఏలె మాణిక్యం, లింగయ్య, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-12T00:03:38+05:30 IST