వాయిలసింగారం వీవోఏని తొలగించాలి

ABN , First Publish Date - 2023-01-26T01:59:25+05:30 IST

మండలంలోని వాయిలసింగారం వీవోఏ కొల్లు సుబ్బారావుని తొలగించాలని ఆ గ్రామ మహిళా సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాల యంలో ఏపీఎం లక్ష్మికి బుధవారం వినతిపత్రం అందజేశారు.

వాయిలసింగారం వీవోఏని తొలగించాలి
వాయిలసింగారంలో ఏపీఎం వినతిపత్రం అందజేస్తున్న మహిళా సంఘం సభ్యులు

అనంతగిరి, జనవరి 25: మండలంలోని వాయిలసింగారం వీవోఏ కొల్లు సుబ్బారావుని తొలగించాలని ఆ గ్రామ మహిళా సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాల యంలో ఏపీఎం లక్ష్మికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ మహిళా సభ్యుల రహస్య వీడియోలు, ఫొటోలను వీవోఏ కొల్లు సుబ్బారావు తీసి తన సెల్‌ఫోన్‌లో భద్రపర్చుకున్నాడని తెలిపారు. వీవోఏని విఽధుల నుంచి తొలగించి మహిళా వీవోఏను నియమించాలని కోరా రు. ఏపీఎం లక్ష్మి మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు పంపటంతో పాటు, మహిళా వీవోఏను నియమిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీసీలు లక్ష్మి, ఏసు, ప్రగతి, చిలకమ్మ, బాలాజీ, కన కాంబరం, నాగ సైదమ్మ, శివగంగ, కల్యాణి, సత్యనారా యణ, రాజ కుమారి, శారద, సైదమ్మ, శ్రీరామదాసు, వెంకట నర్సమ్మ, కనకదుర్గమ్మ పాల్గొన్నారు.

కోటాచలం

Updated Date - 2023-01-26T01:59:25+05:30 IST