రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2023-06-07T00:37:32+05:30 IST
జిల్లాలో సోమ వారం, మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
సూర్యాపేట రూరల్, మఠంపల్లి, పాలకవీడు, జూన్ 6: జిల్లాలో సోమ వారం, మంగళ వారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందాగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సూర్యాపేట రూరల్ ఎస్‌ఐ సాయిరాం తెలి పిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన ఏడునూతల రామకృష్ణ (73), భార్య ఇందిర కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్న కుమారుడి వద్దకు కారులో బయలుదేరారు. అతి వేగంతో వెళుతున్న కారు సూర్యాపేట మునిసిపల్ పరిధిలోని పిలల్లమర్రి స్టేజీ సమీపంలో రోడ్డు దాటుతున్న గేదెను ఢీకొ ట్టింది. గేదె ఎగిరి కారు ముందు భాగంలో పడటంతో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఏనునూతల రామకృష్ణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు వెనక కూర్చున్న భార్య ఇందిర తలకు బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం హైదరా బాద్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో గేదె కూడా చనిపోయింది. రామకృష్ణ రిటైర్డ్ లెక్చరర్ కాగా, ఆయన భార్య ఇందిర రిటైర్డ్ ప్రభుత్వ డాక్టరు. డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ షేక్ జుబేద్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మృతుడి కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
-రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లికి చెందిన సత్తరపు వీరయ్య(51)ద్విచక్రవాహనంపై పని నిమిత్తం హుజూర్‌నగర్ వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా బక్కమంతులగూడెం వద్ద వర్ధాపురానికి చెందిన రామేనమ్మ అడిగితే ఆమెకు లిఫ్టు ఇచ్చాడు. మఠంపల్లి నుంచి బక్కమంతులగూడెంకు వెళుతున్న ప్యాసింబర్ ఆటోను మఠంపల్లి ఇండియన పెట్రోల్ బంకు ఎదుట ద్విచక్ర వాహనం అతివేగంతో ఢీకొట్టింది. ఈప్రమాదంలో తల, గుండె భాగంగా బలమైన గాయాలు కావడంతో వీరయ్య అక్కడి కక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనుక సీట్లో ఉన్న రాయేనమ్మ తీవ్రంగా గాయపడింది. స్థానికుల సమాచారం మేరకు రామేయమ్మను 108 అంబులెన్సులో హుజూర్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య మరియమ్మ, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
- పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన బి.బాబు(33) నేరేడుచర్ల నుంచి ద్విచక్రవాహనంపై స్వగామం వెళుతుండా గ్రామ శివారులో గేదెను ఢీకొట్టి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108అంబులెన్సుకు సమాచారం ఇచ్చారు. అతడిని 108ఈఎంటీ నాగరాజు, పైలట్ శ్రీనివా్‌స మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించాలని ఏరియా ఆసుపత్రి వైద్యులు సూచించారు.