ముగ్గురు తహసీల్దార్ల బదిలీ

ABN , First Publish Date - 2023-03-26T00:06:55+05:30 IST

రెవె న్యూ అంశాలపై జిల్లా అధికారులకు పెద్ద సంఖ్య లో ఫిర్యాదులు అందుతున్నాయి.

ముగ్గురు తహసీల్దార్ల బదిలీ

మరోవారంలో డీటీ, ఆర్‌ఐ, సీనియర్‌ అసిస్టెంట్ల బదిలీ

కసరత్తు చేస్తున్న జిల్లా యంత్రాంగం

యాదాద్రి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రెవె న్యూ అంశాలపై జిల్లా అధికారులకు పెద్ద సంఖ్య లో ఫిర్యాదులు అందుతున్నాయి. ధరణి సమస్యలతోపాటు స్థానికంగా ఉన్న ప్రభుత్వ భూములను రక్షించాలని నిత్యం ఉన్నతాధికారుల దృష్టికి మండల ప్రజలు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూశాఖలో ప్రక్షాళనకు కలెక్టర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పరిపాలనా విధుల్లో భాగంగా పలు మండలాల తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్‌ పమేలాసత్పథి శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు.నారాయణపురం మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న సీ హెచ్‌.శ్రీనివాసరాజును యాదగిరిగుట్ట మండలానికి బదిలీ చేశారు. యాదగిరిగుట్ట తహసీల్దార్‌గా పనిచేస్తున్న రాముభూక్యను సచివాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా రిలీవ్‌ చేశారు. గుండాల తహసీల్దార్‌ జి.జ్యోతిని కలెక్టరేట్‌ కార్యాలయ సూపరింటెండెంట్‌గా నియమించారు. సచివాలయంలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వి.శోభన్‌బాబును గుం డాల తహసీల్దార్‌గా నియమించారు.నారాయణపురం నాయబ్‌ తహసీల్దార్‌గా పని చేస్తు న్న బి.పల్లవికి నారాయణపురం తహసీల్దార్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

త్వరలో డీటీలు, సీనియర్‌ అసిస్టెంట్ల బదిలీలు

జిల్లాలో మొత్తం రెండు రెవెన్యూ డివిజన్లు, 17మండలాలు ఉన్నాయి. చాలా మండలాల్లో సీనియర్‌ అసిస్టెంట్ల కొరత ఉంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌, సీనియర్‌ అసిస్టెంట్లను బదిలీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మూడు మండలాలకు చెందిన తహసీల్దార్లను బదిలీ చేసిన కలెక్టర్‌ మరో వారం రోజుల్లో డీటీలు, సీనియర్‌ అసిసెంట్లు, ఆర్‌ఐలను బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎవరెవరిని ఏ ప్రాంతాలకు బదిలీ చేయాలనే అంశంపై ఇప్పటికే స్పష్టత వచ్చినా, ఎంతమందిని బదిలీ చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 20 మందిని బదిలీ చేయనున్నట్టు తెలిసింది.

Updated Date - 2023-03-26T00:06:55+05:30 IST