Share News

క్రీడా ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2023-12-10T23:59:13+05:30 IST

సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర క్రీడల అధికారి డాక్టర్‌ రాంలక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఆయన వీక్షించారు.

క్రీడా ప్రతిభతో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి

గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర క్రీడల అధికారి రాంలక్ష్మణ్‌

రాజాపేటలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు

ఏడు జోన్ల నుంచి 1,171 మంది క్రీడాకారులు హాజరు

రాజాపేట, డిసెంబరు 10: సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర క్రీడల అధికారి డాక్టర్‌ రాంలక్ష్మణ్‌ అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 9వ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సాంఘిక సం క్షేమ గురుకుల క్రీడాకారులు ఆయా స్థాయిల్లో ఇప్పటివరకు 3,789 బహుమతులు సాధించారని తెలిపారు. క్రీడలతో ఐకమత్యం, స్ఫూరి ్తతోపాటు మనోధైర్యం పెరుగుతుందన్నారు. 9వ రాష్ట్ర క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను గుర్తించి జనవరిలో అదిలాబాద్‌ జిల్లా ఊ ట్నూరులో జరిగే ఇంటర్‌ సొసైటీ టోర్నీకి ఎంపిక చేస్తామన్నారు. సం గారెడ్డి జిల్లాకు చెందిన గురుకుల విద్యార్థిని నందిని ఏషియన్‌ గేమ్స్‌లో ప్రతిభ కనబరిచి మెడల్‌ సాధించటం గర్వకారణమన్నారు. కార్య క్రమంలో ప్రిన్సిపల్‌ నర్సింహాచారి, ఆర్‌సీవోలు రజిని, శ్రీరాం శ్రీనివాస్‌, ఉదయభాస్కర్‌, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఏడు జోన్ల నుంచి 1,171 మంది క్రీడాకారులు హాజరు

రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రెండు రోజు లుగా నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో ఏడు జోన్ల నుంచి 1,171 మంది క్రీడా కారులు పాల్గొంటున్నారు. రాష్ట్రంలో బాలుర విభాగంలో క్రీడా పోటీ లను రెండు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఉప్పల్‌వాయిలో అథ్లెటిక్స్‌, రాజాపేట మండల కేంద్రంలో స్పోర్స్ట్‌ విభాగాల్లో క్రీడోత్సవాలను నిర్వహిస్తున్నారు. రాజాపేట మండలకేంద్రంలో నిర్వహించే పోటీల్లో అండర్‌-14, 17, 19 విభాగాల్లో క్రీడా పోటీలు జరుగుతున్నాయి. కబడ్డీ, వాలీబాల్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, టెన్నికాయిట్‌, క్యారమ్‌, చెస్‌, ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరుస్తున్నారు.

Updated Date - 2023-12-10T23:59:15+05:30 IST