గోవులను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2023-06-26T01:11:16+05:30 IST

గోవులను తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి వారిన 38 ఆవులను స్వాధీనం చేసుకున్నారు.

 గోవులను తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌
పోలీసులు పట్టుకున్న ఆవులు

కోదాడ రూరల్‌, జూన 25: గోవులను తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి వారిన 38 ఆవులను స్వాధీనం చేసుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సాయిప్రశాంత తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం నుంచి హైదరాబాద్‌ కబేళాకు కంటైనర్‌ ద్వారా ఆవులను తరలిస్తున్నా రు. ఆదివారం తెల్లవారుజామున రామాపురం క్రాస్‌ రోడ్డు వద్ద పోలీసు లు వాహనాలను తనిఖీ చేస్తూ కంటైనర్‌లో ఉన్న ఆవులను గుర్తించా రు. జీవహింస నిరోధక చట్టం, తెలంగాణ గోవధ నిరోధక చట్టం కింద డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరి కేసులు నమోదు చేసి 38 ఆవులను స్వాధీ నం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆవులను గోశాలకు తరలించిన ట్లు ఎస్‌ఐ సాయి ప్రశాంత తెలిపారు.

Updated Date - 2023-06-26T01:11:16+05:30 IST