లక్ష్మీనృసింహుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం

ABN , First Publish Date - 2023-03-19T00:14:05+05:30 IST

స్వామివారి ఆశీస్సులతో దేశం, రాష్ట్రమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుందని మైసూర్‌ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద సరస్వతిస్వామిజీ అన్నారు. యాదగిరీశుడు తన ఇలవేల్పు దైవమని చెప్పారు. శనివారం క్షేత్ర సందర్శనకు విచ్చేసిన స్వామీజీకి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. పూజలనంతరం ఆలయ ముఖమండపంలో భక్తులను ఉద్దేశిస్తూ అనుగ్రహణభాషణ చేశారు.

లక్ష్మీనృసింహుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షం
ప్రధానాలయ ముఖమండపంలో అనుగ్రహభాషణం చేస్తున్న గణపతి సచ్చిదానందస్వామీజీ

సచ్చిదానంద సరస్వతి స్వామిజీ

యాదగిరీశుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు

యాదగిరిగుట్ట, మార్చి 18: స్వామివారి ఆశీస్సులతో దేశం, రాష్ట్రమంతా సుభిక్షంగా వర్ధిల్లుతుందని మైసూర్‌ దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద సరస్వతిస్వామిజీ అన్నారు. యాదగిరీశుడు తన ఇలవేల్పు దైవమని చెప్పారు. శనివారం క్షేత్ర సందర్శనకు విచ్చేసిన స్వామీజీకి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. పూజలనంతరం ఆలయ ముఖమండపంలో భక్తులను ఉద్దేశిస్తూ అనుగ్రహణభాషణ చేశారు. పురాణ ప్రాశస్త్యం కలిగిన యాదగిరిగుట్ట ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ ఎంతో భక్తి శ్రద్ధలతో పునర్నిర్మాణం చేశారన్నారు. మానవమాత్రులకు ఇది సాధ్యం కాదని, సాక్షాత్తు లక్ష్మీనృసింహుడే ఆలయాన్ని పునర్నిర్మించుకున్నాడన్నారు. అనంతరం ఆయన కొండపైన అనుబంధ ఆలయమైన పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన ఆలయ అనువంశిక ధర్మకర్త బీ.నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.

యాదగిరిక్షేత్రంలో శాస్త్రోక్తంగా లక్షపుష్పార్చన పూజలు

లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని లక్షపుష్పార్చన పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. సుమారు రెండు గంటల పాటు లక్షపుష్పార్చన పూజలు కొనసాగాయి. యాదగిరీశుడిని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయన ప్రధానాలయంలోని స్వయంభువులను దర్శించుకుని ముఖమండపంలో ఉత్సవమూర్తుల చెంత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామివారిని సినీనటుడు తనికెళ్ల భరిణి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించిన అర్చకులు ప్రధానాలయంలో పూజల అనంతరం ప్రాకార మండపంలో ఆశీర్వచనం అందజేశారు.

Updated Date - 2023-03-19T00:14:05+05:30 IST