పోరాట యోధుల త్యాగం మరువలేనిది

ABN , First Publish Date - 2023-09-18T02:03:40+05:30 IST

తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు మరువలేనివని వి ద్యుతశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

పోరాట యోధుల త్యాగం మరువలేనిది
వేడుకల్లో మాట్లాడుతున్న మంత్రి జగదీషరెడ్డి

అమరుల ఆశయాలకనుణంగా కేసీఆర్‌ పాలన

మంత్రి జగదీ్‌షరెడ్డి

సూర్యాపేట(కలెక్టరేట్‌), సెప్టెంబరు 17: తెలంగాణ సాయుధ పోరాట యోధుల త్యాగాలు మరువలేనివని వి ద్యుతశాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మంత్రి మాట్లాడారు. భూస్వామ్య రాచరికపు వ్యవస్థపై ఎందరో యోధు లు పోరాడారని అన్నారు. చాకలి ఐలమ్మ చైతన్యంతో మొ దలై దొడ్డి కొమరయ్య అమరత్వంతో ఉవ్వెత్తున లేచిన సా యుధ పోరాటం ప్రపంచంలోనే తెలంగాణ చిరస్థాయిగా నిలిచిందన్నారు. హైదరాబాద్‌ సంస్థానం దేశంలో విలీనం కావడంతో రాచరికం ముగిసి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పాలన ఆరంభమైందన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భార త యూనియనలో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించడం సముచితమన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వాటిని తిప్పికొట్టే చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రం గాల్లో వివక్షను ఎదుర్కొందన్నారు. 2001లో సీఎం కేసీఆర్‌ సారధ్యంలో 14ఏళ్ల అవిశ్రాంత పోరాట ఫలితంగా 2014 జూన 2న స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో విద్యుత, తాగు, సాగునీరు, వ్యవసాయం, ప్రజాసంక్షేమం, పారిశ్రామిక రంగాల్లో అనతి కాలంలోనే తెలంగాణ అద్భుతాలను ఆవిష్కరించి దేశానికే దిశానిర్దేశం చేస్తోందన్నారు. ప్రగతిశీల పారదర్శక విధానాల కారణంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. తొలుత సాయుధ పోరాటయోధులకు నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అదే విధంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధులు, వారి కు టుంబ సభ్యులను సన్మానించారు. దీంతో పాటు జిల్లాలో ఉత్తమంగా నిలిచిన పలు పంచాయతీల సర్పంచలు, కార్యదర్శులను అభినందించి ప్రశంసాపత్రాలు అందించారు. అ నంతరం దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, అంగనవాడీలకు వంట సామగ్రి, గణేష్‌ నవరాత్రోత్సవాల నేపథ్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

చేతివృత్తులకు ఆధ్యుడు విశ్వకర్మ

దేవతలతో పూజలందుకున్న విరాట్‌ విశ్వకర్మ చేతివృత్తులకు ఆధ్యుడని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం విశ్వకర్మ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ వెంకట్రావ్‌, జడ్పీ చైర్‌పర్సన గుజ్జ దీపికతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సైన్స ఎంతగా అభివృద్ధి చెందినా, విశ్వకర్మ వేసిన బీజమే దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. సైన్స కూడా కనిపెట్టలేని ఎన్నో గొప్ప నిర్మాణాలను విశ్వకర్మ చేశారన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ వీధిలో నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.

స్టీల్‌ బ్యాంకును సద్వినియోగం చేసుకోవాలి

ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్యాంక్‌ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్‌ బ్యాం క్‌ను ప్రారంభించి మాట్లాడారు. అన్ని కార్యాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించేందుకు మెప్మా ఆధ్వర్యంలో స్టీల్‌ బ్యాంక్‌ ఏర్పాటు అభినందనీయమన్నారు.

మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో బెంగుళూరుకు చెందిన పర్యావరణవేత్త డాక్టర్‌ శాంతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ‘రుతుప్రేమ’ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. మహిళలు ప్యాడ్స్‌కు బదులు కప్స్‌ వాడేలా జిల్లా యంత్రాంగం సాయంతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మహిళలు వాడే ప్యాడ్స్‌, చిన్న పిల్లలకు వాడే డైపర్లు పర్యావరణానికి హాని చేస్తాయన్నారు. వాటికి బదులుగా కప్స్‌ వాడాలని సూచించారు.

ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ

ఓట్లు, రాజకీయ ప్రయోజనం కోసం ప్రజల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ, విమోచనంపై కేంద్ర హోంమంత్రి అమితషాతో పాటు కొంతమంది లేనిపోని అపోహలను సృష్టించడం దురదృష్టకరమన్నారు. పాత గాయాలను రగిలించి సమాజాన్ని చీల్చాలని దుర్మార్గం చేస్తున్న అలాంటి వారు దేశ మనుగడకు ప్రమాదకరమన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వాటిని తిప్పికొట్టే చైతన్యం తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. కర్ణాటకలో కేసీఆర్‌ వంటి ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు కాంగ్రె్‌సకు ఓట్లు వేశారన్నారు. అక్కడ ఒక్క హామీని కూడా నేరవేర్చకుండా కాంగ్రెస్‌ తన అసలు స్వరూపం బయటపెట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ గత చరిత్ర ప్రజలకు తెలుసని సోనియా, రాహుల్‌ ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీవి పగటి కలలే అవుతాయన్నారు. అనంతరం జరిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావ్‌, జడ్పీ చైర్‌పర్సన గుజ్జ దీపిక, అదనపు కలెక్టర్లు సీహెచ.ప్రియాంక, వెంకటరెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్లు పెరుమాళ్ల అన్నపూర్ణ, పోతరాజు రజనీ, వనపర్తి శిరీష, చందమళ్ల జయబాబు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన గోపగాని వెంకటనారాయణగౌడ్‌, పాండురంగాచారి, వీరాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు తౌడోజు సలేంద్రాచారి, శ్రీపాది లక్ష్మణాచారి, కిరణ్‌, రంగు దిలీ్‌పకుమార్‌, శ్రీధర్‌, బ్రహ్మచారి, వెంకటచారి, రమేష్‌, నాగేంద్రాచారి, రాంబాబు, విజయ్‌, రాము, రాజేంద్రప్రసాద్‌, నర్సింహాచారి, మురళి, గోపి, మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, మెప్మా కోఆర్డినేటర్‌ రమే్‌షనాయక్‌, పట్టణ సమాఖ్య ప్రతినిధులు కవిత, విజయలక్ష్మి, రాణి, మరియమ్మ, ఎంపీపీ కుమారి, జడ్పీటీసీ మామిడి అనిత, జిల్లా సంక్షేమాధికారి జ్యోతి పద్మ, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శారద, జూలకంటి జీవనరెడ్డి, గుర్రం సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

క్తం చేస్తున్నా

Updated Date - 2023-09-18T02:03:40+05:30 IST