మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ABN , First Publish Date - 2023-09-22T00:02:47+05:30 IST
చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన తమకు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండలంలోని ఖుదాభక్ష్‌పల్లి, శివన్నగూడ, రాంరెడ్డిపల్లి బాధిత భూ నిర్వాసితులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని కోరారు.
ఎమ్మెల్యే కూసుకుంట్లను కోరిన భూనిర్వాసితులు
మర్రిగూడ, సెప్టెంబరు 21: చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన తమకు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మండలంలోని ఖుదాభక్ష్‌పల్లి, శివన్నగూడ, రాంరెడ్డిపల్లి బాధిత భూ నిర్వాసితులు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని కోరారు. గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని ఖుదాభక్ష్‌పల్లి గ్రామ పంచాయతీపరిధిలో సాయిబండతండా బ్రిడ్జి నిర్మాణ పనుల శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యేను భూ నిర్వాసితులు కలిసి తమ ఆవేదన తెలిపారు. భూనిర్వాసితులు అధైర్యపడొద్దని, రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రులు హరీ్‌షరావు, జగదీ్‌షరెడ్డి హామీ ఇచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇంటిస్థలాలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు అయితగని జంగయ్య, జావిద్, లక్ష్మయ్య, యాదమ్మ, కలమ్మ, యాదయ్య తదితరులు వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన మూడు గ్రామాల భూనిర్వాసితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని నచ్చజెప్పారు. తప్పనిసరిగా ఇంటి స్థలం, నిర్మాణం వచ్చే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు.