‘రజాకార్’ సినిమాను నిషేధించాలి
ABN , First Publish Date - 2023-09-20T00:19:37+05:30 IST
బీజేపీ నేతల ఆధ్వర్యంలో విడుదలకు సిద్ధమైన ‘రజాకార్’ సినిమాను నిషేధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మం గళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ, సెప్టెంబరు 19: బీజేపీ నేతల ఆధ్వర్యంలో విడుదలకు సిద్ధమైన ‘రజాకార్’ సినిమాను నిషేధించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మం గళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం కుల, మత, వర్గ, వర్ణ, లింగబేధం లేకుండా సామాన్యులు సాగించిన మహోన్నత పోరాటానికి మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు. ‘రజాకార్’ ట్రైలర్‌లో ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సన్నివేశాలున్నాయని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి చరిత్ర వక్రీకరణ దృశ్యాలతో కూర్చిన ఆ సినిమాను ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు. నాడు బ్రిటీష్ ప్రభుత్వాన్ని, నైజాం చర్యలను సమర్ధించిన బీజేపీ మూల బీజమైన ఆర్‌ఎ్‌సఎస్ నేడు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే ఎజెండాగా పనిచేస్తోందన్నారు. ఆర్‌ఎ్‌సఎస్ భా వజాలంతో రైతాంగ పోరాటాన్ని వక్రీకరించేలా సినిమా తీశారని ఆరోపించారు. పార్లమెంట్‌లో మహిళాబిల్లును ప్రవేశపెట్టడం శుభపరిణామమని, అయితే సాకులు చూపి ఆటంకాలు సృష్టిస్తే ఊరుకునేది లే దన్నారు. సమావేశంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు రవినాయక్, మల్లు గౌతంరెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, కందుకూరి రమేష్, లక్ష్మినారాయణ, రామారావు పాల్గొన్నారు.