తుది ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలి

ABN , First Publish Date - 2023-09-20T00:13:31+05:30 IST

తుది ఓటరు జాబితా పారదర్శకంగా, పకడ్బందీ గా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకురా లు నిర్మల అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం మండలాల వారీగా ఫాం-6, 7, 8 దరఖాస్తులపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు.

తుది ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలి
కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ఓటరు జాబితా పరిశీలకురాలు నిర్మల

ఓటరు జాబితా పరిశీలకురాలు నిర్మల

భువనగిరి అర్బన్‌, సెప్టెంబరు 19: తుది ఓటరు జాబితా పారదర్శకంగా, పకడ్బందీ గా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకురా లు నిర్మల అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం మండలాల వారీగా ఫాం-6, 7, 8 దరఖాస్తులపై అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడా రు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఓటరు తుది జాబితా రూపొందించాలన్నారు. ప్రతీ వారం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు దరఖాస్తుల వివరాలు అందించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల సహకారంతో వాటిని సరిచేస్తామన్నారు.

ఓటరు దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా వారంలోగా పరిష్కరించి ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గత నెల 26, 27 ఈనెల 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరా ల ద్వారా దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు వివరించారు. జిల్లాలో ని 421 పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీల్లో ఓటురు నమోదుపై విస్తృత ప్రచారం నిర్వహించామన్నారు. ప్రతీ బుధవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వివరాలను ఎప్పటికప్పుడు అందించామన్నారు. అదనపు కలెక్టర్‌ జి.వీరారెడ్డి మాట్లాడుతూ, ఓటు నమోదు, ఓటరు చైతన్యంపై విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సమావేశంలో ఆర్డీవో పరాంకుశం అమరేందర్‌, పలు పార్టీల ప్రతినిధులు బట్టు రామచంద్రయ్య, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కూర వెంకటేశ్‌, ఈరపాక నరసింహ, బట్టుపల్లి అనురాధ, కిరణ్‌కుమార్‌, వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఎన్నిక ల విభాగం సూపరింటెండెంట్‌ ఎం.నాగేశ్వరచారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-20T00:13:31+05:30 IST