మోదీ పాలనలో దేశం అగ్రభాగాన
ABN , First Publish Date - 2023-06-11T01:12:42+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అగ్రభాగాన నిలిచిందని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మో దీ తొమ్మిది సంవత్సరాల పాలన లో చేపట్టిన సంక్షేమ పథకాల పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడా రు.
కేంద్ర మంత్రి మహేంద్రనాథ్‌పాండే
నల్లగొండ, హాలియా, జూ న్ 10: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేళ్ల పాలనలో దేశం అగ్రభాగాన నిలిచిందని భారీ పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మో దీ తొమ్మిది సంవత్సరాల పాలన లో చేపట్టిన సంక్షేమ పథకాల పై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడా రు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రతీ ఒక్కరికి ఇంటిని నిర్మించాలనే యోచనతో చేపట్టిన పథకం అద్భుత ఫలితాలు ఇస్తోందన్నారు. 3.50కోట్ల మందికి ఇల్లు నిర్మించి ఇచ్చిన ట్టు చెప్పారు. అదేవిధంగా ప్రతీ ఒక్కరికి మరుగుదొ డ్డి ఉండాలన్న లక్ష్యంతో దేశంలో 11.72 కోట్ల మరుగుదొడ్డ నిర్మాణాన్ని పూర్తి చేయడంతోపాటు, 12కోట్ల గృహాలకు మంచినీటి సౌక ర్యం కల్పించామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5లక్షల వరకు ఉచిత వైద్యం, జన ఔషది కేంద్రాల ద్వారా తక్కువ ధరకు మందు లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంల్లో బీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయం బీజేపీయే అని, ఆ పార్టీని ఎదుర్కొనే శక్తి తమకే ఉందన్నారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ భావిస్తోందని, అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శృతి, జిల్లా ఇన్‌చార్జి ప్రదీప్, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్, నాయకులు బండారు ప్రసాద్, నూకల నర్సింహారెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్‌రెడ్డి, సాంబయ్య, నిమ్మల రాజశేఖర్‌రెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, కంకణాల నివేదిత, నాగం వర్షిత్‌రెడ్డి, నాగిరెడ్డి, బొజ్జ నాగరాజు, గుర్రం వెంకన్న, వెంకట్‌సాయి, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, పాలకూరి రవి, నీరజ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను నిర్మించడంతోనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. శనివారం కేంద్ర ప్రభుత్వ నిధులతో 14వ మైలు వద్ద ఎడమ కాల్వపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొత్తగా దేశంలో 53,868 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించామని అన్నారు. నాగార్జునసాగర్ నుంచి నకిరేకల్ వరకు రూ.370కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారి పనులను పూర్తి చేశామన్నారు. జూలై 31వ తేదీ నాటికి ఈ పనులు పూర్తికావాల్సి ఉండగా, కేవలం ఒక్క బ్రిడ్జి పనులు తప్ప మిగతా పనులు నిర్ణీత సమయానికే పూర్తి చేస్తామన్నారు.