కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

ABN , First Publish Date - 2023-03-19T00:11:36+05:30 IST

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి
పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకుడు పటేల్‌ రమేష్‌రెడ్డి

పెన్‌పహాడ్‌, మార్చి 18: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌రెడ్డి అన్నారు. హాత్‌ సేహాత్‌ జోడో పాదయాత్ర శనివారం మండలంలోని భాగ్యతండా, రంగయ్యగూడెం, ఎర్రంశెట్టిగూడెం, భక్తాళాపురం గ్రామాల్లో కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర పాలకులు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచి, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నా యకులు బచ్చు పల్లి నాగేశ్వర్‌రావు, బెల్లంకొండ శ్రీరాములుగౌడ్‌, కుందూరు వెంక టరెడ్డి, యాట ఉపేందర్‌, ఎంపీటీసీలు గద్దల నాగరాజు, కొండేటి పవన్‌ కుమార్‌, మాజీ ఎంపీటీసీ చింతం వెంకటేశ్వర్లు, తొగరు వెంకటేశ్వర్లు, మండలి పిచ్చయ్య, నారాయణ శ్రీధర్‌రెడ్డి, యలమంచమ్మ, యశోద, చంద్రకళ, షఫీ ఉల్లా పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:11:36+05:30 IST