రేవంత్‌పై దాడియత్నం హేయమైన చర్య

ABN , First Publish Date - 2023-03-02T00:57:41+05:30 IST

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అధికారి పార్టీ నాయకులు దాడికి యత్నించడం హేయమైన చర్య అని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు.

రేవంత్‌పై దాడియత్నం హేయమైన చర్య
వలిగొండలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌రెడ్డి

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

వలిగొండ/ఆత్మకూరు(ఎం), మార్చి 1: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై అధికారి పార్టీ నాయకులు దాడికి యత్నించడం హేయమైన చర్య అని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో భావ స్వేచ్ఛ ప్రతీ పౌరుడికి ఉంటుందని, కాంగ్రెస్‌ చేపడుతున్న హాత్‌సే హాత్‌ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభించడంతో ఓర్వలేక బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం వెల్వర్తి, మొగిలిపాక, కేర్చిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలతో కలిసి పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య, నాయకులు బోళ్ల శ్రీనివాస్‌, తుమ్మల నర్సయ్య, శ్రీనివాసరావు, గరిసె రవి, బద్దం సంజీవరెడ్డి, బత్తిని లింగయ్య, సహదేవ్‌, వెంకన్న, సుధాకర్‌ పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అని కాంగ్రెస్‌ పార్టీ మండలఅధ్యక్షుడు యాస లక్ష్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు(ఎం) సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో నాయకులు కందడి అనంతరెడ్డి, ఎం.సిద్దులు, జె.నగేష్‌, డి.నర్సింహ్మచారి, పి.మల్లేశం, ఎన్‌.వెంకట్‌రెడ్డి, టి.రాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T00:57:41+05:30 IST