పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి

ABN , First Publish Date - 2023-06-07T01:00:12+05:30 IST

పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా కొనసాగుతోందని శాసనమండ లి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

పారిశ్రామిక రంగంలో తెలంగాణ దేశానికే దిక్సూచి
పారిశ్రామిక ప్రగతి దినోత్సవ సభలో మాట్లాడుతున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

మిర్యాలగూడ, జూన్‌ 6: పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా కొనసాగుతోందని శాసనమండ లి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఓ ఫంక్షన్‌హల్‌లో జరిగిన పారిశ్రామిక ప్రగతి దినోత్సవసభలో మాట్లాడారు. పరిశ్రమలకు ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు పొం దే అవకాశం కల్పించడమే కాకుండా విద్యుత్‌, భూమి, నీటి వసతి ప్రపంచ స్థాయి మౌలిక వసతులను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. 2014-15 వరకు రాష్ట్రంలో 7,700 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుండ గా 2023-24 నాటికి అది 18000 మెగావాట్లకు చేరుకుందని అన్నారు.పాల ఉత్పత్తు లు మొదలు ఫార్మా కంపెనీల వరకు రాష్ట్రంలో నెలకొల్పరన్నారు. రైస్‌ఇండస్ట్రీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. మిర్యాలగూడ రైస్‌బౌల్‌గా మిర్యాలగూడ పెరుగాంచిందని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 80 శాతం సిమెంట్‌ పరిశ్రమలు నెలకొల్పబడ్డాయన్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రా వు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గంలో 40 వేల కోట్లతో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నెలకొల్పిందన్నా రు. 600 కోట్లతో వీర్లపాలెం వద్ద ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మించబోతున్నారని తెలిపారు. ఆటోనగర్‌ను పారిశ్రామిక వాడగా రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ తిప్పన విజయసింహరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌తిరునగరు భార్గవ్‌, రైతుబంధు జిల్లా అధ్యక్షులు చింతిరెడ్డి శ్రీనివాసరె డ్డి, ఆర్డీఓ చెన్నయ్య, ఎంపీపీ నూకల సరళ, వైస్‌ చైర్మన్‌ కుర్ర విష్ణు, రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాద్యక్షులు రమేశ్‌, మిర్యాలగూడ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు శ్రీనివాస్‌ ఎంపీపీలు,జడ్పీటీసీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T01:00:12+05:30 IST