అందరికీ తెలంగాణ ఫలాలు

ABN , First Publish Date - 2023-05-17T00:19:00+05:30 IST

రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ఫలాలు అందరికీ అందుతున్నాయని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయసమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సబ్బండ కులాలను ఏకంచేసి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు.

అందరికీ తెలంగాణ ఫలాలు
సమ్మేళనంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ సునీతామహేందర్‌రెడ్డి

ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

యాదగిరిగుట్ట రూరల్‌, మే 16: రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ఫలాలు అందరికీ అందుతున్నాయని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఆత్మీయసమ్మేళనంలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ సబ్బండ కులాలను ఏకంచేసి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పరిపాలన కొనసాగుతోందన్నారు. అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్‌ సహకారంతో ఆలేరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ దళితుల వెనుకబాటుతనాన్ని గుర్తించి వారి అభివృద్ధికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో దళితబంధు పథకం అమలు చేస్తున్నారన్నారు. అనంతరం డీసీసీ బీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, మదర్‌డెయిరీ చైర్మన్‌ లింగాల శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో గడ్డమీది రవీందర్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల, పట్టణ అధ్యక్షులు కర్రె వెంకటయ్య, కసావు శ్రీనివా్‌సగౌడ్‌, మిట్ట వెంకటయ్యగౌడ్‌, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, పీఏసీఎస్‌ గుట్ట చైర్మన్‌ ఇమ్మిడి రాంరెడ్డి, భీమగాని నర్సింహగౌడ్‌, డప్పు వీరస్వామి, రేపా క స్వామి, చంద్రగాని జహంగీర్‌గౌడ్‌, కౌకుంట్ల శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్‌ కొండం అరుణ, భాస్కర్‌గౌడ్‌, తోటకూరి బీరయ్య, బీబీనగర్‌ లక్ష్మణ్‌, ఎంపీటీసీ మౌనిక పాల్గొన్నారు.

Updated Date - 2023-05-17T00:19:00+05:30 IST