ప్రశ్నించే గొంతుకను గెలిపించిన ఉపాధ్యాయులు

ABN , First Publish Date - 2023-03-19T00:23:38+05:30 IST

మోసపూరిత విధానాలను అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని టీపీయూఎస్‌ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెల్కపల్లి పెంటయ్య, జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమ అన్నారు.

 ప్రశ్నించే గొంతుకను గెలిపించిన ఉపాధ్యాయులు
విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న తపస్‌ నాయకులు

భువనగిరి టౌన్‌, మార్చి 18: మోసపూరిత విధానాలను అనుసరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పారని టీపీయూఎస్‌ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెల్కపల్లి పెంటయ్య, జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమ అన్నారు. తపస్‌ ఆధ్వర్యంలో శనివారం భువనగిరిలో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవీఎన్‌రెడ్డి విజయోత్సవ ర్యాలీలో వారు మాట్లాడారు. పాలకుల అవమానాలకు ఎన్నికల రూపకంలో ఉపాధ్యాయులు బదులు తీర్చుకున్నారన్నారు. బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.కార్యక్రమంలో నాయకులు సీవీ శ్రీనివాస్‌, కొత్తకొండ శ్రీధర్‌, కే.భాస్కర్‌రెడ్డి, పి.రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:23:47+05:30 IST