సురక్షా దినోత్సవ్‌ ర్యాలీని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2023-06-03T00:31:36+05:30 IST

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీన నిర్వహించే సురక్షా దినోత్సవ్‌ ర్యాలీని విజయవంతం చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

సురక్షా దినోత్సవ్‌ ర్యాలీని  విజయవంతం చేయాలి
ర్యాలీ నిర్వహణ ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌

సూర్యాపేట అర్బన, జూన 2 : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీన నిర్వహించే సురక్షా దినోత్సవ్‌ ర్యాలీని విజయవంతం చేయాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ర్యాలీలో పాల్గొనే వాహనాలు జిల్లా కేంద్రంలోని ఎస్వీ కళాశాల నుంచి పీఎ్‌సఆర్‌ సెంటర్‌ మీదుగా ఖమ్మం క్రాస్‌రోడ్డు, కొత్తబస్టాండ్‌ మీదుగా ఇంటిగ్రేడెట్‌ మార్కెట్‌ వద్ద జరిగే సభ ప్రాంగణానికి చేరుకుంటాయన్నారు. ర్యాలీలో పెట్రోకార్‌, బ్లూకోర్స్‌, డయల్‌-100, పోలీస్‌ సాంకేతికత, సైబర్‌ సెక్యూరిటీ, షీటీం, భరోసా సెంటర్‌ నిర్వాహకులు పాల్గొంటారని తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, పోలీస్‌ సిబ్బంది అధికసంఖ్యలో పాల్గొనాలన్నారు. సమావేశం అనంతరం ర్యాలీ మార్గాలను, వాహనాల రిహార్సల్స్‌ను పరిశీలించారు.

ఏఎ్‌సఐలుగా పదోన్నతి

ఏఎస్‌ఐలుగా పదోన్నతి ఉత్తర్వులను అంజనరెడ్డి, వాసా కృష్ణ, జానయ్య, శ్రీరాములు ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ నుంచి శుక్రవారం అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ఉత్తర్వు కాపీలను ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయని, అంచనాలకు అనుగుణంగా విధులు నిర్వహించి అధికారుల, ప్రజల మన్ననలను పొందాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-06-03T00:31:36+05:30 IST