ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య
ABN , First Publish Date - 2023-11-02T00:32:37+05:30 IST
ఆర్థిక ఇబ్బందులతో మనస్తామపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భువనగిరి టౌన, నవంబరు 1: ఆర్థిక ఇబ్బందులతో మనస్తామపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణం అర్బన కాలనీకి చెందిన ముత్యాల హరీష్ (24) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూలీ పనులతో జీవనం సాగించే ఇతను ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఇంట్లోనే ఫ్యానకు ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్సపెక్టర్ ఎస్.సుధీర్ కృష్ణ తెలిపారు.