కార్పొరేట్‌ విద్యావ్యవస్థల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు

ABN , First Publish Date - 2023-05-26T00:58:02+05:30 IST

ర్యాంకుల కోసం కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఒత్తిడి చేయడం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి జగ

కార్పొరేట్‌ విద్యావ్యవస్థల వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు
మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి, పక్కన ఎంపీ బడుగుల

మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి

భానుపురి, మే 25 : ర్యాంకుల కోసం కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఒత్తిడి చేయడం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బాస్కెట్‌ బాల్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ నాల్గో యూత ఇంటర్‌ డిసి్ట్రక్‌ అండర్‌ -16 బాల, బాలికల ఛాంపియనషి్‌ప పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పంటలు రాక అప్పుల ఉబిలో రైతులు చిక్కుకుని బలవన్మరణాలు ఒకప్పుడు చేసుకునేవారని, విద్యార్థులు మాత్రం పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే భయంతోనే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కార్పొరేట్‌ వ్యవస్థ తీసుకవచ్చిందన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలు ర్యాం కుల కోసమే తప్ప క్రీడలపై దృష్టి సారించడంలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రొత్సహించి క్రీడాకారులకు అండగా ఉంటుందన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ మాట్లాడుతూ తెలంగాణ దేశానికి అన్ని రంగాల్లో రోల్డ్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ మాట్లాడుతూ దేశానికి క్రీడలు మంచి గుర్తింపును తీసుకువస్తాయన్నారు. 31 జిల్లాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారని క్రీడల కార్పొరేషన చైర్మన రావుల శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, బాస్కెట్‌బాల్‌ రాష్ట్ర కార్యదర్శి ఐజాక్‌, డీఎస్పీ నాగభూషణం, మునిసిపల్‌ వైస్‌చైర్మన పుట్టా కిషోర్‌, బాస్కెట్‌బాల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫారూక్‌, కౌన్సిలర్‌ తాహేర్‌, రజాక్‌, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-26T00:58:02+05:30 IST