రాష్ట్రస్థాయి రగ్బీపోటీలు ప్రారంభం
ABN , First Publish Date - 2023-06-01T01:09:13+05:30 IST
మఠంపల్లి మండల కేంద్రంలోని మాన్‌ఫోర్టు మైదానంలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. సెయింట్ ఆన్స్ సుపీరియర్ సిస్టర్ రూబి పోటీలను ప్రారంభించగా, సూర్యాపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, మెడ్చల్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, జిల్లాల నుంచి మొత్తం 280మంది విద్యార్థులు పాల్గొన్నారు.
15 జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులు
నేడు సెమీ ఫైనల్, ఫైనల్స్ పోటీలు
మఠంపల్లి, మే 31: మఠంపల్లి మండల కేంద్రంలోని మాన్‌ఫోర్టు మైదానంలో రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. సెయింట్ ఆన్స్ సుపీరియర్ సిస్టర్ రూబి పోటీలను ప్రారంభించగా, సూర్యాపేట, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, ఖమ్మం, మెడ్చల్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, జిల్లాల నుంచి మొత్తం 280మంది విద్యార్థులు పాల్గొన్నారు.
హోరాహోరీగా పోటీలు
మొదటి రోజు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. సూర్యాపేట, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్ బాలికల జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. అంతకుముందు బాలుర విభాగంలో జరిగిన పోటీలో సూర్యాపేట, మెదక్, హైదరాబాద్, మేడ్చల్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నట్లు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తరుణ్‌రెడ్డి తెలిపారు. గువారం సెమీ ఫైనల్, ఫైనల్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రగ్బీ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్ణం గణేష్, రవికుమార్, బ్రదర్ పితృస్, సిస్టర్ సుజాత, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి, మ్యాచ్ రిఫరీలు శ్రీకాంత్, మహేష్, రాజేష్, సుమన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.