పారిశుధ్యంలో అగ్రస్థానంలో నిలపాలి

ABN , First Publish Date - 2023-09-18T02:12:21+05:30 IST

పారిశుధ్యంలో అగ్రస్థానంలో నిలపాలి

పారిశుధ్యంలో అగ్రస్థానంలో నిలపాలి

కోదాడ టౌన, తిరుమలగిరి, సెప్టెంబరు 17: కోదాడను పారిశుధ్యంలో అగ్ర స్థానంలో నిలపడానికి అధికారులు, సిబ్బంది కృషిచేయాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం కోదాడలోని పట్టణ పోలీ్‌సస్టేషన ఎదురుగా అనంతగిరి రోడ్డులో ఏర్పాటుచేసిన స్వచ్ఛ భారత లీగ్‌ 2.0 కార్యక్రమంలో వేస్ట్‌ టు రీఆర్ట్‌ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుధ్యానికి పెద్దపీట వేసిందన్నారు.

-తిరుమలగిరిలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించి చెత్తను మార్కెట్‌ చైర్‌పర్సన స్రవంతి, ఎంపీపీ స్నేహలత శుభ్రం చేశారు. కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2023-09-18T02:12:41+05:30 IST