విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన అభినందనీయం

ABN , First Publish Date - 2023-03-25T23:12:33+05:30 IST

విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన అభినందనీయమని సూర్యాపేట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన ఉప్పల లలితాఆనంద్‌ అన్నారు.

విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన అభినందనీయం
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న ఉప్పల లలితాఆనంద్‌

సూర్యాపేటకల్చరల్‌, మార్చి 25: విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావన అభినందనీయమని సూర్యాపేట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌పర్సన ఉప్పల లలితాఆనంద్‌ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని వేదాంత భజనమందిరంలో సీతారామచంద్రస్వామి నవరాత్రిఉత్సవాల్లో భాగంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు క్విజ్‌పోటీలు నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అనంతరం క్విజ్‌ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ మొరిశెట్టి శ్రీనివాస్‌, కోఆప్షన సభ్యులు వెంపటి సురేష్‌, రాచర్ల వెంకటేశ్వరరావు, నకరికంటి రాజశేఖర్‌, సోమ అశోక్‌, నాగవల్లి ప్రభాకర్‌, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-25T23:12:33+05:30 IST