ఇందిరమ్మ కాలనీలో మురికినీటి సమస్యకు పరిష్కారం

ABN , First Publish Date - 2023-08-22T01:27:32+05:30 IST

పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మురికి నీటి కాలువ సమస్య ఎట్టకేలకు తొలగిపోయింది.

 ఇందిరమ్మ కాలనీలో మురికినీటి సమస్యకు పరిష్కారం
పైప్‌లైన ఏర్పాటుచేస్తున్న సిబ్బంది

బీబీనగర్‌, ఆగస్టు 21: పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మురికి నీటి కాలువ సమస్య ఎట్టకేలకు తొలగిపోయింది. కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో కాలనీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈనెల 11న ఆంధ్రజ్యోతి మినీలో ‘మురికి నీటి కాలువకు అడ్డుకట్ట.. ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం’ అనే శీర్షక కథనం ప్రచురితమైంది. సోమవారం బీబీనగర్‌ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే పైళ్ల దృష్టికి నాయకులు, కాలనీవాసులు కాలనీలో మురికి కాలువ సమస్యను ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయారు. దీంతో ఆయన స్పందించి తక్షణమే మురికి కాలువ సమస్యను పరిష్కరించాలని అందుకు సంబంధించిన పను లు వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించడంతో అధికారులు అప్పటికప్పుడు డ్రైనేజీ పైపులైన పనులు చేపట్టి ఇబ్బందులను తొలగించారు.

Updated Date - 2023-08-22T01:27:32+05:30 IST