సామాజిక కార్యకర్త కాచరాజు మృతి

ABN , First Publish Date - 2023-05-26T00:19:57+05:30 IST

: భువనగిరి పట్టణానికి సామాజిక కార్యకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు కాచరాజు జయప్రకాశ్‌రావు(75) గురువారం గుండెపోటుతో మృతిచెందారు.

సామాజిక కార్యకర్త కాచరాజు మృతి
కాచరాజు జయప్రకాశ్‌రావు

భువనగిరి టౌన్‌, మే 25: భువనగిరి పట్టణానికి సామాజిక కార్యకర్త, విశ్రాంత ఉపాధ్యాయుడు కాచరాజు జయప్రకాశ్‌రావు(75) గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన ఉపా ధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే సామాజిక సేవా, సాహిత్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 50కిపైగా సంఘాలు, వేదికలను ఏర్పాటు చేసి ఆయా సమస్యలపై గళం విప్పేవారు. జన విజ్ఞాన వేదిక, ప్రజా సైన్స్‌, హేతువాద, వినియోగదారుల, రచయితల తదితర సేవా సంఘాల్లో పాల్గొంటూనే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. తపాలా సేవలపై ప్రజలకు అవగా హన కల్పించారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. భువనగిరిలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-05-26T00:19:57+05:30 IST