యాదగిరిక్షేత్రంలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం
ABN , First Publish Date - 2023-06-18T03:47:44+05:30 IST
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్కులర్‌ను జారీ చేసింది.
80గ్రాముల చిరుధాన్యపు లడ్డూ ధర రూ.40
21 నుంచి భక్తులకు అందుబాటులోకి
యాదగిరిగుట్ట, జూన్ 13: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేయాలని రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్కులర్‌ను జారీ చేసింది. అండుకొర్రలు, అరికెలు, సామలు, ఊదలతో బెల్లం లడ్డూలను తయారు చేసేందుకు అధికారులు గతంలోనే మార్గదర్శకాలు జారీచేశారు. ఆయా దేవాలయాల్లో వంట స్వాములు చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలను వివిధ సైజుల్లో గత నెలలో తయారు చేసి నమూనాలను దేవాదాయశాఖకు పంపించారు. అధికారులు వాటిని నిపుణుల కమిటీకి పరిశీలనకు పంపారు. నిపుణుల కమిటీ పరిశీలన అనంతరం చిరుధాన్యాల లడ్డూ ప్రసాదాల పంపిణీకి ఆమోదముద్ర పడింది. ఒక్కో లడ్డూ ధరను రూ.40గా అధికారులు నిర్ణయించారు. ఈ నెల 21 నుంచి చిరుధాన్యాల లడ్డూలను విక్రయించనున్నారు.