సర్వేంద్రియానాం నయనం ప్రధానం

ABN , First Publish Date - 2023-02-22T01:23:17+05:30 IST

సర్వేంద్రియానాం.. నయనం ప్రధానమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ బి.గౌతమ్‌ప్రసాద్‌ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.

సర్వేంద్రియానాం నయనం ప్రధానం
సమావేశంలో మాట్లాడుతున్న గౌతమ్‌ ప్రసాద్‌

సూర్యాపేటలీగల్‌, ఫిబ్రవరి 21: సర్వేంద్రియానాం.. నయనం ప్రధానమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ బి.గౌతమ్‌ప్రసాద్‌ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కంటి చూపు లేనివారిని ఆదరించి, అక్కున చేర్చుకోవాలన్నారు. కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీవాణి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి జె.ప్రశాంతి, జిల్లా వైద్యాధికారి కోటాచలం, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోండ్రాల అశోక్‌, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్‌, జె.శశిధర్‌, వసం త సత్యనారాయణపిళ్లై పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T01:23:18+05:30 IST