సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త

ABN , First Publish Date - 2023-02-22T01:03:13+05:30 IST

సేవాలాల్‌ మహరాజ్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త
మిర్యాలగూడలో బోగ్‌బండార్‌ను సమర్పిస్తున్న మండలి చైర్మన్‌ గుత్తా

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

మిర్యాలగూడ, ఫిబ్రవరి 21: సేవాలాల్‌ మహరాజ్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త అని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సేవాలాల్‌ 284వ జయంతి సందర్భంగా మంగళవారం నిర్వహించిన బోగ్‌ బండార్‌ కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆగ్రోస్‌, ట్రైకార్‌ చైర్మన్లు తిప్పన విజయసింహారెడ్డి, రాంచందర్‌నాయక్‌లతో కలిసి పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి సేవాలాల్‌ భవన్‌ వరకు రథంతో ర్యాలీ నిర్వహించి మహ బోగ్‌బండార్‌ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల భగవత్‌ స్వరూపం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని అన్నారు. గిరిజనులంతా భక్తితో కొలుచుకునే సేవాలాల్‌ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘసేవకుడని కొనియాడారు. ప్రతి గిరిజన బిడ్డా ఆయన బోధనల ప్రకారం నడుచుకోవాలని కోరారు. ఆరు శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజన సంక్షేమశాఖలో 1,650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింద న్నారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం 83 గిరిజన గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేసి 75,410 విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు బంజారాల పట్ల అపార మైన గౌరవం ఉందన్నారు. సేవాలాల్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి గిరిజనుల పట్ల ప్రేమను చాటుకుంటోందన్నారు. సేవాలాల్‌ జయంతి సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన పోటీల విజేతలకు జ్జాపి కలు అందజేశారు. వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్‌ చిట్టిబాబునాయక్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ బి. చెన్నయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు స్కైలాబ్‌నాయక్‌, నూకల సరళా హన్మం తరెడ్డి, ధనావత్‌ బాలాజీనాయక్‌, ఆంగోతు లలిత హతీరాం, ఎంపీడీవో సేవ్యానాయక్‌, ధశరధ్‌ నాయక్‌, పాచునాయక్‌ పాల్గొన్నారు.

బీఎల్‌ఆర్‌ ఆధ్వర్యంలో..

కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గిరిజన నేతలు సేవాలాల్‌ జయంతి నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బీఎల్‌ఆర్‌ కార్యాలయం నుంచి సేవాలాల్‌ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. పాలరాతి సేవాలాల్‌ విగ్రహాన్ని వీధుల్లో ఊరేగిస్తూ గిరిజన సాంప్రదాయం ప్రకారం ఉత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నాగునాయక్‌, రవినాయక్‌, సిద్దూనాయక్‌ పాల్గొన్నారు.

గిరిజన ఆరాధ్యదైవం సంత్‌ సేవాలాల్‌ : ఎమ్మెల్యే రవీంద్ర

చందంపేట: గిరిజన ఆరాధ్యదైవం సంతు సేవాలాల్‌ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మండలంలోని పోలేపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద నిర్వహించిన సేవాలాల్‌ జయంతిలో మాట్లాడారు. సేవా లాల్‌ బంజార జాతికి ఆరాధ్యదైవమని, ఏవిధంగా జీవించాలో 300 సంవత్సరాల క్రితమే చెప్పిన గొప్ప మహానీయుడని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సర్వయ్య, లక్ష్మణ్‌నాయక్‌, ఆంజనేయులు, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-22T01:03:16+05:30 IST