పారిశుధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-01-22T00:00:24+05:30 IST

ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.

పారిశుధ్య కార్మికురాలి ఆత్మహత్యాయత్నం

కోదాడ రూరల్‌, జనవరి 21: ఉద్యోగం పోయిందనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో శనివారం జరిగింది. భర్త కంకణాల ఉపేందర్‌, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పారి శుధ్య కార్మికులుగా కాంట్రాక్టు పద్ధతిన పదిమంది పనిచేస్తున్నారు. కోదాడ ఆసుపత్రిని ప్రభుత్వం ఇటీవల 30పడకల నుంచి 15పడకలకు తగ్గించింది. పదిమంది కార్మికుల్లో ముగ్గురు కార్మికులను విధుల నుంచి తొలగించారు. వారిలో కోదాడకు చెందిన కంకణాల ఉషను కూడా 20రోజుల కింద విధుల నుంచి తొలగించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైంది. తాను ఆర్థిక ఇబ్బం దుల్లో ఉన్నానని, తొలగించవద్దని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రోజూ కాంట్రాక్టర్‌, ఆసుపత్రి చుట్టూ తిరుగుతోంది. తాను నాలుగున్నర సంవత్స రాల నుంచి పనిచేస్తున్నానని, విధుల నుంచి తొలగించడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆమె ఆసుపత్రి అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. వారు స్పందించలేదు. పట్టణంలోని నయానగర్‌లో గల ఇంట్లో ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపింది. ఇంట్లో ఎవరూ లేని సమ యంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే భర్త కంకణాల ఉపేందర్‌కు సమాచారం ఇచ్చారు. వారు వెం టనే ఇంటి తలుపులు పగులగొట్టి స్పృహ కోల్పోయిన ఉషను కోదాడ ప్రభు త్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కోదా డలోనే ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉష భర్త కంకణాల ఉపేందర్‌ కూడా గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పారి శుధ్య కార్మికుడిగా పనిచేశాడని, కాంట్రాక్టర్‌ ఇచ్చే జీతం సరిపోకపోవడంతో గత సంవత్సరం కిందటే మానివేసి సుతారు పనికి వెళ్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా విధుల నుంచి తొలగించడం వ ల్లనే ఉష ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమెను వెంటనే విధుల్లోకి తీసు కోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేశారు. కోదాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉషను వివిధ సంఘాల ప్రజా నాయకులు పరామర్శించారు. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతకముందు సీపీఎం, వైఎ స్సార్‌ టీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఉషను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Updated Date - 2023-01-22T00:00:25+05:30 IST