నేటినుంచి అందుబాటులోకి ‘సదరం’ స్లాట్లు

ABN , First Publish Date - 2023-06-01T01:03:51+05:30 IST

దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్లు అందుబాటులో ఉంటాయని ఇన్‌చార్జి డీఆర్డీవో టి.నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

   నేటినుంచి అందుబాటులోకి ‘సదరం’ స్లాట్లు

భువనగిరి అర్బన్‌, మే 31: దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్లు అందుబాటులో ఉంటాయని ఇన్‌చార్జి డీఆర్డీవో టి.నాగిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు ధ్రువపత్రాల పునరుద్ధరణ, కొత్త ధ్రువపత్రాలను అందజేయనున్నట్లు ప్రక టించారు. ఆయా మండలాల్లో మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే ఈ క్యాంపులో పాల్గొనాలని కోరారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ క్యాంపులో దరఖాస్తు చేసుకోవద్దని సూచించారు. వైద్య బృందం వికలత్వ శాతాన్ని నిర్ధారించిన తర్వాతే సదరం ధ్రువపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యులు అందుబాటులో లేకుంటే క్యాంపు రద్దు చేస్తామని వివరించారు. ఆధార్‌ , ఓటర్‌, రేషన్‌ కార్డు, వైద్యులు ఇచ్చిన రిపోర్టులు తీసుకుని ఈనెల 1న ఉదయం 11గంటలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. శారీరక లోపం ఉన్న వారికి కొత్తగా మంజూరు కానున్నవి 30కాగా రెన్యూవల్‌ కావాల్సినవి 10, వీరికి జూన్‌ 3, 8, 17, 24తేదీల్లో క్యాంపు ఉంటుందని తెలిపారు. మానసిక రుగ్మతకు సంబంధించి కొత్తవి 20, రెన్యూవల్స్‌ 40 క్యాంపు జూన్‌ ఐదో తేదీన. కంటిలోపం కొత్తవి 25, రెన్యూవల్స్‌ 10, జూన్‌ తొమ్మిదో తేదీన, వినికిడిలోపం ఉన్నవారికి కొత్తవి 40, రెన్యూవల్స్‌ 10 జూన్‌ 13వ తేదీన క్యాంపు ఉంటుందని తెలిపారు.

Updated Date - 2023-06-01T01:03:51+05:30 IST