జనసేన సభ్యుడికీ రూ.5 లక్షల బీమా

ABN , First Publish Date - 2023-09-22T00:49:05+05:30 IST

జనసేన సభ్యత్వం పొందిన వారికి ఆ పార్టీ అధ్యక్షుడు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారని జనసేన తుంగతుర్తి నియోజకవర్గ నాయకుడు సిరుపంగి అరవింద్‌కళ్యాణ్‌ అన్నారు.

జనసేన సభ్యుడికీ రూ.5 లక్షల బీమా
ప్రతీ జనసేన సభ్యుడికీ రూ.5 లక్షల బీమా

మోత్కూరు, సెప్టెంబరు 21: జనసేన సభ్యత్వం పొందిన వారికి ఆ పార్టీ అధ్యక్షుడు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నారని జనసేన తుంగతుర్తి నియోజకవర్గ నాయకుడు సిరుపంగి అరవింద్‌కళ్యాణ్‌ అన్నారు. గురువారం మోత్కూరు ఆర్యవైశ్య భవనలో నిర్వహించిన జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల (పుస్తకాల) పంపిణీలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. కార్యకర్తలు సభ్యత్వ నమోదు వేగంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు మీసాల మహేష్‌, అనిల్‌, శివ, పవన, సాయి, సంపత, యాకస్వామి, యాసిన, శేఖర్‌, చరణ్‌, నాగరాజు, భాస్కర్‌, నవీన పాల్గొన్నారు.

Updated Date - 2023-09-22T00:49:05+05:30 IST