వాహనం డిక్కీ నుంచి రూ.52 వేలు చోరీ
ABN , First Publish Date - 2023-09-23T00:30:04+05:30 IST
మోత్కూరు హెచడీఎ్‌ఫసీ ఎదుట నిలిపి ఉంచిన బైక్ సైడ్‌బాక్స్ (డిక్కీ) నుంచి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి రూ.52వేలు, భూమి పట్టాదారు పాస్ పుస్తకం చోరీ చేశాడు.
మోత్కూరు, సెప్టెంబరు 22: మోత్కూరు హెచడీఎ్‌ఫసీ ఎదుట నిలిపి ఉంచిన బైక్ సైడ్‌బాక్స్ (డిక్కీ) నుంచి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి రూ.52వేలు, భూమి పట్టాదారు పాస్ పుస్తకం చోరీ చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన లగ్గాని వెంకటేశ్వర్లు శుక్రవారం బ్యాంకు రుణం చెల్లించడానికి రూ.52 వేలు బైక్ సైడ్ బాక్స్‌లో పెట్టుకుని ఎస్‌బీఐ మోత్కూరు బ్రాంచికి వెళ్లాడు. బ్యాంకులో తీ సుకున్న రుణం, వడ్డీ కలిపి రూ.1.20 లక్షలు అయ్యింది. రుణమాఫీ పోగా ఇంకా ఎంత బాకీ ఉందన్న వివరాలు తెలుసుకున్నాడు. భూమిని తనఖా పెట్టి రుణం తీసుకోవడానికి వివరాలు తెలుసుకుందామని, డబ్బులు బైక్ (టీఎస్ 30ఏ 1928) డిక్కీలోనే పెట్టి అంబేడ్కర్ చౌరస్తాలోని హెచడీఎ్‌ఫసీ బ్యాంకు వద్దకు వెళ్లాడు. బ్యాంకు ఎదుట బైక్ పార్క్ చేసి, బ్యాంకు లోకి వెళ్లి వివరాలు తెలుసుకుని తిరిగి వచ్చే సరికి గుర్తు తెలియని వ్యక్తి బైక్ సైడ్ బాక్స్ తెరిచి అందులోని రూ.52 వేలు, భూమి పాస్‌పుస్తకం ఎత్తుకెళ్లాడు. స్థానికులను ఆరా తీసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ శ్రీకాంతరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బ్యాంకులోని, పరిసర ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దొంగ కోసం గాలిస్తున్నారు.