రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
ABN , Publish Date - Dec 17 , 2023 | 12:00 AM
భూదాన్‌పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటన నేపథ్యంలో శనివారం పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పరిశీలించారు.
భూదాన్‌పోచంపల్లిలో ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 16: భూదాన్‌పోచంపల్లిలో ఈ నెల 20న రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటన నేపథ్యంలో శనివారం పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్ ఆవరణలో జరుగుతున్న ఏర్పాట్లను అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనకు సభా ఏర్పాట్లను, చేనేత యూనిట్లను, స్టాళ్ల ఏర్పాటుకు వసతులను ఆయన పరిశీలించారు. హెలిప్యాడ్ కోసం పోలీ్‌సస్టేషన్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించి తగు సూచనలు చేశారు. భూదానోద్యమ చారిత్రక నేపథ్యం కలిగిన భూదాన్‌పోచంపల్లిని సందర్శించనున్న రాష్ట్రపతి ఇక్కడి భూదానోద్యమానికి స్మృతి చిహ్నమైన వినోబా మందిరాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భూదాన్ గంగోత్రి ప్రాంగణంలోని భూదానోద్యమ పిత ఆచార్య వినోబాభావే, ప్రథ మ భూదాత వెదిరె రామచంద్రారెడ్డిల కాంస్య విగ్రహాలతోపాటు భూదాన్‌యజ్ఞ స్థూపా న్ని సందర్శించి అక్కడ నిర్వహించాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమాల్లో జిల్లా చేనేత, జౌళి శాఖ ఏడీ విద్యాసాగర్, తహసీల్దారు బి.వీరాబాయి, మునిసిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రాజేష్, వినోబాసేవాసంఘం ప్రతినిధులు ఏలె భిక్షపతి, కొయ్యడ నర్సింహగౌడ్ పాల్గొన్నారు.