ఆటోమెటిక్‌ స్టార్టర్ల తొలగింపు

ABN , First Publish Date - 2023-02-21T00:28:26+05:30 IST

సూర్యా పేట జిల్లా మద్దిరాల, నూతనకల్‌ మండలాల్లో వ్యవ సాయ మోటార్లకు ఏర్పాటుచేసిన ఆటోమెటిక్‌ స్టార్టర్ల విద్యుత అధికారులు సోమవారం తొలగించారు. మద్దిరాల మండలం చిననెమిల, మామిళ్లమడవ గ్రామాల్లో పర్యటించిన విద్యుత శాఖ అధికారులు వ్యవసాయ మోటార్లకు బిగించి ఉన్న

ఆటోమెటిక్‌ స్టార్టర్ల తొలగింపు
చిననెమిలలో ఆటోమెటిక్‌ స్టాటర్లను తొలగిస్తున్న విద్యుత్‌ అధికారులు

మద్దిరాల/నూతనకల్‌, ఫిబ్రవరి20 : సూర్యా పేట జిల్లా మద్దిరాల, నూతనకల్‌ మండలాల్లో వ్యవ సాయ మోటార్లకు ఏర్పాటుచేసిన ఆటోమెటిక్‌ స్టార్టర్ల విద్యుత అధికారులు సోమవారం తొలగించారు. మద్దిరాల మండలం చిననెమిల, మామిళ్లమడవ గ్రామాల్లో పర్యటించిన విద్యుత శాఖ అధికారులు వ్యవసాయ మోటార్లకు బిగించి ఉన్న ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించారు. తమ అనుమతి లేకుండా స్టార్టర్లను తొలగించారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తామని గొప్పలు చెప్పి నేడు ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించడమేంటని ప్రశ్నించారు. విద్యుత్‌ ఏ సమయంలో వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

నూతనకల్‌ మండలంలోనూ...

రైతులు తమ బోరు బావులకు ఉన్న ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించాలని విద్యుత ఏఈ ప్రణయ్‌ కోరారు. మండలంలోని ఎర్రపహాడ్‌, దిర్శనపల్లి గ్రామాల్లో విద్యుత సిబ్బంది వ్యవసాయ బోర్ల ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ విద్యుత ఆదాతో పాటు, భూగర్భ జలాలను కాపాడుకోవడం కోసం రైతులు ఆటోమెటిక్‌ స్టార్టర్లను స్వచ్ఛందంగా తొలగించుకోవాలన్నారు. కార్యక్రమంలో లైనమన నాగార్జున, లింగారెడ్డి ఉన్నారు.

Updated Date - 2023-02-21T00:28:30+05:30 IST